Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మంత్రులకు ఘన స్వాగతం.. భారీ ర్యాలీతో దద్దరిల్లిన మిర్యాలగూడ..!

Miryalaguda : మంత్రులకు ఘన స్వాగతం.. భారీ ర్యాలీతో దద్దరిల్లిన మిర్యాలగూడ..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం మంత్రులు సూటిగాలి పర్యటన చేశారు. పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిర్యాలగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ ఇలక త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మిర్యాలగూడకు విచ్చేసిన మంత్రులకు పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. మిర్యాలగూడ పట్టణం చేరుకున్న వారికి వాహనాలు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పిసిసి నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, పిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు,

కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, మహబూబ్ అలీ, శాగ జలంధర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, గుండు నరేందర్ గౌడ్, వెంకన్న, బంటు లక్ష్మీనారాయణ, దేశిడి శేఖర్ రెడ్డి, గోదాల జానకి రెడ్డి, శేఖర్ రెడ్డి, మొల్లాల అమృత రెడ్డి, రునాల్ రెడ్డి, తలకొప్పుల సైదులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Kangti : మనసాక్షి ఎఫెక్ట్.. అధికారుల స్పందన.. హ్యాండ్ పంప్ మరమ్మతులు..! 

  2. Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!

  3. Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

  4. Accident : రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి.. తండ్రికి తీవ్ర గాయాలు..!

మరిన్ని వార్తలు