తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో హైద్రాబాద్ కు చెందిన “నవీన” అనే మహిళ కు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. మహిళకు పెళ్లి అయ్యి15 నెలల బాబు “ధనుష్” ఉన్నాడు. ఈ క్రమంలోనే భర్తను,15 నెలల పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు ప్లాన్ వేసింది.

డైరెక్ట్ గా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చి ఆ బాబును బస్టాండ్ లోనే వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత.. ఆ పిల్లగాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

టూటౌన్ ఎస్సై సైదులు వెంటనే స్పందించి.. స్టేషన్ లోని సిబ్బందిని బస్టాండ్ కు పంపారు. పోలీసులు బస్టాండ్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి.

ఆ బాలుడు “మమ్మీ” అంటూ గుర్తించాడు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు బైకు యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తెలిసింది. అటువైపుగా విచారణ చేపట్టగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయమై భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది.

అనంతరం.. మహిళను, ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడిని.. ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిభర్తకు అంటే బాలుడు తండ్రికి పిల్లాడిని అప్పగించారు. నల్లగొండ టూ టౌన్ ఎస్సైసైదులు గౌడ్, పోలీసు సిబ్బంది చేసిన పనికి నల్గొండ ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు.

By : ChandraShekar, Nalgonda 

MOST READ : 

  1. Kamareddy : ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు.. ప్రవాహంలో చిక్కిన 30 మంది రైతులు..!

  2. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

  3. Modi : ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డ్.. ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోదీ..!

  4. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

  5. ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

మరిన్ని వార్తలు