Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండవిద్య

Miryalaguda : ఎస్వీ మోడల్ హైస్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే..!

మిర్యాలగూడ వాసవి నగర్‌లోని ఎస్.వి. మోడల్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

Miryalaguda : ఎస్వీ మోడల్ హైస్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ వాసవి నగర్‌లోని ఎస్.వి. మోడల్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాశెట్టి శ్రీనివాస్ హాజరై విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జీవితంలో ఆత్మవిశ్వాసం, కృషి ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని సూచించారు.
పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాం సుందర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 570కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. డైరెక్టర్ ఓరుగంటి విశాలక్ష్మీ విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తూ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొని విజయపథంలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు