District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
కామారెడ్డి జిల్లా (దోమకొండ), మన సాక్షి:
భూ సమస్యలపై రైతులు దరఖాస్తు సమర్పిస్తే, భూ భారతి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని. భూ భారతి చట్టం పై జిల్లాలోని ,ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో , బిబిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ,భూభారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025 న ప్రారంభించడం జరిగిందని , చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ధరణీ స్తానంలో భూ భారతి భూమి హక్కుల చట్టం, ఆర్ ఓ ఆర్ తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టంలో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని. హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు.
వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు, నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని.పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందన్నారు.
తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే, ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు.
ఆధార్ తరహాలో రైతులకు భూదార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఇంతే నివృత్త చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున, సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని. ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు. చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు.
భూమిహక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్సు గల సర్వేయర్ తో భూమి సర్వే చేయించుకొని, మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే, మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాసుపుస్తమలో సర్వే మ్యాప్ ను ఉంచడం జరుగుతుందన్నారు. ఏ మైన భూ సమస్య ఉంటే సదరు పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ఎవిడెన్స్ రికార్డు చేయాలనీ, స్పీకింగ్ ఆర్డర్స్ స్పష్టమైన రీమార్కులతో నమోదు చేయాలని తెలిపారు.
ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు పెడితే భూ భారతి చట్ట ప్రకారం విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలపై విచారణ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూ భారతి చట్టం లింగంపేట్ మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ భూ భారతి పై అవగాహన కల్పించుకోవాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పంటలు సాగు చేసే పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మించుకోవాలని, భూ గర్భ జలాలు అంతరించి పోతున్న తరుణంలో వర్షపు నీటిని భూమిలోకి ఇంకిపోయే విధంగా ఫాం పాండ్స్, ఇంకుడు గుంతలు, కాంటూరు కందకాలు ఏర్పాటుచేసుకోవాలని రైతులకు సూచించారు. వీటి నిర్మాణాలవలన భూగర్భ నీటి సాంద్రత పెరుగుతుందని తెలిపారు.
ప్రతీ గ్రామ పంచాయతీలో కనీసం 5 ఫామ్ పాండ్స్ నిర్మించాలని, ఉపాధి హామీ పథకం క్రింద ఈ పనులు చేపట్టవచ్చని తెలిపారు. ఉపాధి హామీ సిబ్బంది రైతులకు వివరించి ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వీణ మాట్లాడుతూ, భూ భారతి చట్టం గురించి వివరించారు. గత ధరణీ లో 33 మాడ్యూల్స్ ఉండేదని, ఈ భూ భారతి చట్టంలో కేవలం 6 మాడ్యూల్స్ తో భూముల యాజమానుల సమస్యలు తీర్చడానికి వీలు కలుగుతుందన్నారు.
భూముల విస్తీర్ణం, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. వారసత్వంగా వస్తున్న యజమానులకు పేరు మార్పులు చేయవచ్చని, దానికి ముందు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి ఆర్డీఓ పూర్తి విచారణ జరిపి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారనీ తెలిపారు.
గతంలో ధరణీ లో అప్పీలు ప్రోవిజన్ లేదని, కేవలం సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని. బీబీపేట్, దోమకొండ లోని పలువురు రైతులు మాట్లాడుతూ, ధరణీ వలన రైతులు సమస్యలను ఎదుర్కొన్నారని, సమస్యలు ఉత్పన్నమైనవని తెలిపారు. రైతుల సంక్షేమం దృశ్య ప్రభుత్వం భూ భారతి చట్టం సరళీకృతం చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాతరాజు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, సుతారి రమేష్ , తహసీల్దార్ లు సంజయ్ రావు, నారాయణ, నాయకులు నల్లపు శ్రీనివాస్, ఆశబోయిన శ్రీనివాస్, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Haythnagar : హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 30 కి పైగా గుడిసెలు దగ్ధం..!
-
Karreguttalu : కర్రెగుటల్లో బాంబుల మోత.. 38 మంది మావోల మృతి..!
-
Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!
-
Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!









