Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు..!

BREAKING : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు..!

చింతపల్లి, మన సాక్షి :

హైదరాబాదు నాగార్జున సాగర్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చింతపల్లి మండల పరిధిలోని హరిజనాపురం గ్రామానికి చెందిన తంగళ్ల లక్ష్మయ్య వయసు 64 సంవత్సరాలు అతని భార్య తంగళ్ల అంజమ్మ ఇరువురు కలిసి వారి యొక్క లూ నా TS O 5 FK 5765 నెంబర్ గల వాహనంపై రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్న బోయినపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి తన స్వగ్రామమైన హరిజనాపురం గ్రామానికి లూన పై వెళ్తుండగా సాయంత్రం 6 గంటల సమయంలో చింతపల్లి మండల కేంద్ర సమీపంలోకి చేరుతుండగాTS10 EE 1004 నెంబర్ గల హోండా సిటీ కార్ హైదరాబాదు నుండి మల్లేపల్లి వైపు వెళ్తూ లక్ష్మయ్య వాహనాన్ని వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది.

దీంతో లూనా పై వెళ్తున్న లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందగా, అతని భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే పోలీసులు చేరుకొని అంజమ్మను హైదరాబాదులోని కొత్తపేట సాయి సంజీవని ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య తమ్ముడు తంగళ్ల లింకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి ఎస్ఐ బి,యాదయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

పెళ్లయిన ఏడాదిలోపే.. రాత్రి 10 గంటలకు బైక్ పై వెళుతుండగా..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మరిన్ని వార్తలు