డ్రైవర్ నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి

సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘటన మేళ్లచెరువు లోని కీర్తి సిమెంట్స్ లో గురువారం చోటుచేసుకుంది.

డ్రైవర్ నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి

మేళ్లచెరువు, మనసాక్షి:

సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘటన మేళ్లచెరువు లోని కీర్తి సిమెంట్స్ లో గురువారం చోటుచేసుకుంది.

ఎస్సై సురేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం..కీర్తి సిమెంట్స్ లో కోల్ మిల్లర్ గా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగి మన్నెం సుబ్బారావు(58) కిలన్ వద్ద పనిచేస్తుండగా,జామ్ అయిన క్లింకర్ ను తొలగిస్తున్న టెరాక్స్ లోడర్ వాహనం కేతిరెడ్డిప్రమాదవశాత్తూ సుబ్బారావుకు బలంగా తగిలింది.

డ్రైవర్ భూక్యా నగేష్ అజాగ్రత్తగా నడపడంతో టెరాక్స్ లోడర్ సుబ్బారావుకు బలంగా తగిగింది.దీంతో సుబ్బారావుకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. మృతుని కోడలు సాయిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ALSO READ : BIG BREAKING : కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు విఫలం.. ఒంటరిగా పోటీకి సిద్ధమైన సిపిఎం..!