Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : ఆటోలను ఇష్టానుసారంగా నిలిపి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. డీఎస్పీ వార్నింగ్..!
Miryalaguda : ఆటోలను ఇష్టానుసారంగా నిలిపి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. డీఎస్పీ వార్నింగ్..!
మిర్యాలగూడ, అక్టోబర్ 4, మన సాక్షి :
ఆటో డ్రైవర్లు రోడ్లపై ఆటోలను ఇష్టానుసారంగా నిలిపి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డిఎస్పి రాజశేఖర్ రాజు హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఆటోలకు నెంబర్ కనిపించే విధంగా ఉండాలని, ప్రతి ఒక్కరు తమ యొక్క ఆటోను సంబంధించిన పేపర్లను కలిగి ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నాగార్జున, వన్ టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









