Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లావరంగల్ పట్టణ జిల్లా

ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లంచం కేసుల్లో రోజుకో ఉన్నతాధికారి ఏసీబీ కి చిక్కుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అదేవిధంగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో కలకలం రేపుతుంది.

హనుమకొండ కలెక్టరేట్ లో ఓ ప్రైవేటు స్కూల్ రెన్యువల్ చేసేందుకు సంస్థ యాజమాన్యం నుంచి 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ హనుమకొండ అదన కలెక్టర్ వెంకట్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు. వెంకట్ రెడ్డి ప్రస్తుతం హనుమకొండ సబ్ కలెక్టర్ తో పాటు డీఈఓ గా అదనపు బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

MOST READ : 

  1. Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ ఆపరు.. నేరుగా వెళ్ళొచ్చు..!

  2. ACB : ఏసీబీకి చిక్కిన చండూరు డిప్యూటీ తాసిల్దార్..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!

  4. TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు