Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండ

Miryalaguda : రైస్ మిల్లు ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్..!

Miryalaguda : రైస్ మిల్లు ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్..!

మన సాక్షి , వేములపల్లి :

మిర్యాలగూడలో ధాన్యం కు మద్దతు ధర చెల్లించడం లేదని అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై రైతులు రాస్తారోకో చేయడంతో రైస్ మిల్లును అధికారులు తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో ఉన్న మహర్షి రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు చేశారు.

సోమవారం అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మహర్షి రైస్ మిల్లును తనిఖీ చేశారు రైతుల ఆందోళనల నేపథ్యంలో ఈ తనిఖీ కొనసాగింది. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ మద్దతు ధర చెల్లించని రైస్ మిల్లులను సీజ్ చేస్తామన్నారు.

రైతుల ఫిర్యాదు పై మహర్షి రైస్ మిల్లుకు నోటీస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 82 సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు దాన్యం తీసుకొస్తే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడంతో పాటు బోనస్ కూడా పొందాలన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన పేర్కొన్నారు. వారి వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ తహసిల్దార్ హరిబాబు, వేములపల్లి ఆర్ ఐ కోటేశ్వరి తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు