మునగాల : 41 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు

మునగాల : 41 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు
మునగాల , మనసాక్షి :
41 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. ఆదివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1981-82 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 70 మంది విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నల్లపాటి శ్రీనివాసరావు, కర్నాటి సుధాకర్, అంజిరెడ్డి ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా పలుక రించుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కృష్ణయ్య, తులిశమ్మ, వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థీ వివిధ వృత్తుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం గురువులను సన్మానించారు.
పూర్వ విద్యార్థులందరూ కలిసి మండల కేంద్రానికి వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందులో నల్లపాటి శ్రీనివాస్ 30 శాతం ఖర్చులు ఇచ్చేందుకు ముందుకువచ్చారు.
ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు కృష్ణయ్య తులసమ్మ వెంకటరెడ్డి, జానయ్య, భాగ్యమ్మ, ఏనుగుల నాగేశ్వరరావు, నాగినా, సుంకర శ్రీనివాస్, కోటయ్య, గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.