Miryalaguda : ఉపాధి హామీ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్డిఓ..!
దామరచర్ల గ్రామపంచాయతీ కొండ్రపోల్ గ్రామ పంచాయతీలను నల్గొండ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.

Miryalaguda : ఉపాధి హామీ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్డిఓ..!
దామరచర్ల, మన సాక్షి:
దామరచర్ల గ్రామపంచాయతీ కొండ్రపోల్ గ్రామ పంచాయతీలను నల్గొండ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరిగే చోటికి వెళ్లి కూలీలతో మాట్లాడి మరియు ఆయా గ్రామాలలోని నర్సరీ పనులను పరిశీలించారు. ఐకెపి కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడ కూలీలతో మాట్లాడి ఎండాకాలం నందు మంచినీళ్ల వసతి టెంటు ఏర్పాట్లు మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూలీలకు అందుబాటులో ఉంచాలని ఎంపీడీవో ఏపీవో కి ఆదేశాలు ఇచ్చారు.
ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు ఉదయం 6 గంటలకు ఉపాధి హామీ పనులను ప్రారంభించి 11 గంటల వరకు ముగించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోని కూలీలందరూ ఉపాధి హామీ పనులను ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకొని ఈ ఎండాకాలంలో ఉపాధి హామీలో సంపాదించిన డబ్బులతో ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అలివేలు మంగమ్మ, ఏపీవో నాగేశ్వరరావు ఏపీఎం కృష్ణమూర్తి తాళ్ల వీరప్పగూడెం గ్రామ సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు ఈసీ శంకర్ టిఏ సైదా ఆయా గ్రామపంచాయతీల కార్యదర్శులు దామరచర్ల మండలం ఫీల్డ్ అసిస్టెంట్ రామచంద్రా గ్రామపంచాయతీ ఉపాధి కూలీలు మరియు వాడపల్లి గ్రామపంచాయతీ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.









