Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : గాంధీ జయంతి తర్వాత ప్లాస్టిక్ కవర్స్ కనిపిస్తే తీవ్ర చర్యలు.. హెచ్చరించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..!

Miryalaguda : గాంధీ జయంతి తర్వాత ప్లాస్టిక్ కవర్స్ కనిపిస్తే తీవ్ర చర్యలు.. హెచ్చరించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్స్ కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్లాస్టిక్ కవర్స్ మ్యాని ఫ్యాక్చరింగ్ కంపెనీ యజమాన్యం, ప్లాస్టిక్ కవర్స్ హోల్ సేల్ రిటైల్ సైలర్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ… పర్యావరానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్స్ పూర్తిగా నియంత్రించాలంటే మీ పాత్ర కీలకమన్నారు.నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకటించిన ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి నియోజకవర్గంలో కేవలం కంపోస్టబుల్ కవర్స్ మాత్రమే కనిపించాలన్నారు. హానీ కలిగించే ప్లాస్టిక్ కవర్స్ ఏ వ్యాపారి అమ్మిన కొన్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు