TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

చేపల వేటకు వెళ్లి మూడు రోజులుగా పదిమంది వరదనీటిలోనే.. ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలు నాయక్..!

చేపల వేటకు వెళ్లి మూడు రోజులుగా పదిమంది వరదనీటిలోనే.. ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలు నాయక్..!

చింతపల్లి, మనసాక్షి.

నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని గోనబోయినపల్లి గ్రామానికి చెందిన చిన్న పిల్లలతో సహా పదిమంది చెంచులు సిద్దాపూర్ శివారులోని డిండి వాగులోని చేపల వేటకు వెళ్లి వరదల్లో చిక్కుకున్నారు. కురుస్తున్న వర్షం కారణంగా వాగు నుండి వరదలు ఒక్కసారి రావడంతో వాగును దాటలేక వాగులోనే ఒక రాతి రాతి బండపై కి అందరూ చేరుకున్నారు. మూడు రోజులుగా వరద నీటిలోని చిక్కుకున్నారు.

ఈ సంఘటన విషయం గోన బోయినపల్లి గ్రామంలో నివసించే వారి బంధువులు చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరలేదని గ్రామ పెద్దలకు అధికారులకు సమాచారం అందించారు. వరదల్లో చిక్కుకున్న బాధితుల విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రంగంలోకి దిగి పోలీస్ రెవెన్యూ యంత్రాంగంతో మంగళవారం ఉదయం7 గంటలకు సంఘటనా స్థలానికి వెళ్లారు.

వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరదల్లో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చేందుకు గజ ఈతగాళ్లతో వాగులో చిక్కుకున్న ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్పించారు. ఈ సందర్భంగా ఓదార్చి అధైర్య పడవద్దు అని వారికి నేనున్నానని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల వరకు ఎక్స్ గ్రేషియా అందిస్తుందని భరోసా కల్పించారు. వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారం కూడా అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని వారు పేర్కొన్నారు.

అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు. ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. భారీ వర్షాల, వరదలతో వాటిల్లిన నష్టం పై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి బాధితులను ఆదుకోవాలని వారు పేర్కొన్నారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతి నేను వెంకటేశ్వరరావు డిడి మాజీ సర్పంచ్ శైలేష్, గడ్డమీద సాయి, మేకల కాసన్న, బద్దెల శ్రీను, డిండి మండల ఎస్ ఐ, సి ఐ, ఆర్డీవో శ్రీరాములు,అచ్చంపేట నాయకులు, గజ ఈతగాళ్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Railway : రాత పరీక్ష లేకుండానే రైల్వే జాబ్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు..!

తెలంగాణలో రేపు విద్యాసంస్థలు బంద్..!

 

మరిన్ని వార్తలు