Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsహైదరాబాద్

BREAKING : అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అరెస్టు.. ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసిన శంకర్‌పల్లి పోలీసులు..!

BREAKING : అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అరెస్టు.. ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసిన శంకర్‌పల్లి పోలీసులు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను నగ్నంగా సందర్శించి పూజలు చేస్తూ వివాదాస్పదంగా మారిన లేడీ అఘోరి శ్రీనివాస్ ను శంకర్‌పల్లి మండలంలోని మోకిల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ వీరబాబు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగ్న పూజల పేరుతో లేడీ అఘోరి తనను మోసం చేసిందని మోకిల పోలీస్ స్టేషన్ లో మండలంలోని ప్రగతి రిసార్ట్స్ లోని ఓ మహిళ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.

మహిళకు ఆరు నెలల క్రితం లేడీ అగోరితో పరిచయం ఏర్పడిందని, పరిచయమైన రెండు నెలల తర్వాత ఇద్దరూ ప్రగతి రిసార్ట్స్ లో డిన్నర్ కు పిలిచారని, ఆ తర్వాత నుంచి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవారన్నారు. అఘోరి మహిళా కష్టాలు అడిగి తెలుసుకునేదని, ఓ పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలోనే పూజ కోసం ఐదు లక్షల రూపాయలు అఘోరి అకౌంట్లో వేసిందని. ఆ తర్వాత యూపీలోని ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ పూజలు చేసిందన్నారు.

మరసటి రోజు మరో ఐదు లక్షలు అడిగిందని, డబ్బులు ఇవ్వకపోతే పూజ విఫలం అవుతుందని భయపెట్టిందన్నారు. అఘోరి మాటలతో భయపడిపోయిన మహిళ మరో నాలుగు లక్షల 50 వేలు అకౌంట్ లో వేసిందని వివరించారు. ఇలా మొత్తం రూ.9.50 లక్షలు నమ్మించి తీసుకుందన్నారు.

అఘోరి అంతటితో ఆగకుండా మరో ఐదు లక్షలు కావాలంటూ బెదిరింపులకు దిగిందని, దీంతో మహిళ పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తుండగా అరెస్ట్ చేసి మోకిల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

MOST READ : 

  1. District Collector : భూ భారతి చట్టంతో భూ తగాదాలకు చెక్.. జిల్లా కలెక్టర్..!

  2. Crypto Currency : క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి.. డబ్బుకు, క్రిప్టోకు తేడా ఏంటి..!

  3. Nalgonda : బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పని చేయాలి.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..!

  4. Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!

మరిన్ని వార్తలు