తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లాలో అఘోరి ప్రత్యక్షం.. యువకులతో ఘర్షణ, తల్వార్ తో దాడి..!

సూర్యాపేట జిల్లాలో అఘోరి ప్రత్యక్షం.. యువకులతో ఘర్షణ, తల్వార్ తో దాడి..!

సూర్యాపేట, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా పెను సంచలనం గా మారు మోగిపోతున్న పేరు అఘోరి మాత. తాను సనాతన ధర్మం కోసం వచ్చానని అగోరి మాత చెప్పుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాంటి అఘోరి సూర్యాపేట జిల్లా ఛివ్వేంల మండలం లో కత్తులు, తల్వరులతో ఘర్షణ కు దిగిన సంఘటన చోటు చేసుకుంది.

తాజాగా శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలోని చివ్వేంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ప్రత్యక్షమైంది. గ్రామస్తులకు అఘోరికి రాత్రి కొట్లాట చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఉండ్రుగొండ గ్రామస్తులు ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి గ్రామానికి వెళుతుండగా ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి ఉండ్రుగొండ ఆర్చి వద్ద వారికి అఘోరి కనిపించింది.

వాహనాలను పక్కకు ఆపీ ఆమెను తిలకించి ఫోటోలు, వీడియోలు తీస్తున్న సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన అఘోరి కార్ లో ఉన్న తల్వారు( కత్తి)ని తీసుకొని వారి వెంట పడింది. ఆగ్రహించిన గ్రామస్తులు పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఆమెను కొట్టినట్టు సమాచారం.

అలాగే తల్వార్(కత్తి)తో ఓ గ్రామస్తుడి కాలు మీద అఘోరి కొట్టినట్టు వారు తెలిపారు. దీంతో అక్కడి నుండి గ్రామస్తులు పారిపోయారు. కానీ అర్ధరాత్రి సమయంలో నాకు క్షమాపణలు చెప్తేనే ఈ గ్రామం నుంచి వెళ్తానని, కత్తి తీసుకొని ఉండ్రుగొండ గ్రామంలోకి అఘోరి ప్రవేశించింది.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామంలోకి వెళ్లి అఘోరి మాతకు నచ్చజెప్పి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో అక్కడి నుంచి పంపించారు. అక్కడి నుండి వెళ్లిపోయిన అఘోరి మాత ఎన్ హెచ్ 65 జాతీయ రహదారి ఖాసీంపేట అడ్డ రోడ్డు వద్ద మళ్లీ ప్రత్యక్షమైంది.

అక్కడున్న యువకులతో కూడా వాగ్వాదానికి దిగిందని సమాచారం. కుంభమేలా జరుగతున్న ఈ సమయం లో నాగ సాదువులతో అక్కడ గడపాలసిన సమయం లో అఘోరి గుట్టల ప్రాంతం అయినా ఉండ్రుగొండ లో అర్ధరాత్రి వేళ సంచారించడం ఏమిటి అంటూ పలువురు విస్మయ్యం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. ఆ గ్రామంలో సంపూర్ణ మధ్య నిషేధం.. అమ్మితే రూ. 50 వేలు జరిమానా.. ఏకగ్రీవ నిర్ణయం..!

  2. TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!

  3. Miryalaguda : అభ్యాస్ టెక్నో హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం..!

  4. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

మరిన్ని వార్తలు