మద్యానికి బానిస అయిన భర్త.. డబ్బులు ఇవ్వడంలేదని భార్య హత్య.. నిందితుడు అరెస్టు..!
మద్యానికి బానిస అయిన భర్త.. డబ్బులు ఇవ్వడంలేదని భార్య హత్య.. నిందితుడు అరెస్టు..!
గుర్రంపోడు, మనసాక్షి :
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాడి గూడెంలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుని అరెస్టు చేసిన గుర్రంపోడు పోలీసులు మహిళను హత్య చేసిన కేసులో నిందితుని అరెస్టు చేసినట్టు కొండమల్లేపల్లి సీఐ డి రాజు గుర్రంపూడ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ డి రాజు మాట్లాడుతూ మార్చి 31 న గుర్రంపోడు మండలం తెరాడి గూడెం లో దుప్పల అరుణ (35 ) ఆమె భర్త దుప్పల్లి కిరణ్ మద్యానికి బానిసై తాగడానికి భార్య డబ్బులు ఇవ్వట్లేదని కోపంతో భార్యతో గొడవపడేవాడు. ఆమెను కత్తితో మెడ కోసి హత్య చేసి పరారయ్యాడు.
కిరణ్ కిరణ్ వైశ్య ఆటో డ్రైవర్ గా గతంలో పనిచేస్తున్న క్రమంలో అరుణ అనే మహిళ పరిచయమైంది. 11 సంవత్సరాల క్రితం పరిచయం కాస్త పెళ్లిగా మారింది. అరుణ యాదవ్ కులానికి సంబంధించింది. కులాంతర వివాహం చేసుకున్న క్రమంలో వాళ్ల దాంపత్య జీవితానికి 3 సంవత్సరాల బాలుడు. పెళ్లయిన ఆరు నెలల వరకు మంచిగనే ఉండేవాడని ఆ తర్వాత మెల్ల మెల్లగా మద్యానికి అలవాటు పడి మద్యానికి బానిస అయ్యి తనకున్న ఆటోను కూడా సక్రమంగా నడపకపోవడంతో ఆటోకు ఉన్న నెలసరి ఈఎంఐ కూడా సరిగా కట్టకపోవడంతో ఫైనాన్సు వాళ్ళు ఆటోని తీసుకెళ్లడం జరిగింది.
అదే క్రమంలో నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడు. వాళ్ల భార్య అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు కూడా లాక్కెళ్ళి మద్యం తాగేవాడు. రెండు సంవత్సరాల క్రితం తెరాడి గూడెంలో అలా బంధువులు ఇప్పటినుండి అయినా మంచిగా ఉంటాడని తెరాడి గూడెంలో కిరాణా షాపు పెట్టించారు. అరుణ షాపు నడిపిస్తున్న క్రమంలో 10 రోజులు మంచిగా ఉన్నటు ఉండిమళ్ళి తాగుడు మొదలుపెట్టాడు.
తాగుడు కలవాటై భార్యను కొట్టడం ఇంటిని పట్టించుకోకపోవడం జరిగేది. అదే క్రమంలో 15 రోజులు క్రితం వాళ్ల భార్యతో గొడవ పడి బంధువుల దగ్గరికి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాల దగ్గరికి పోయేవాడు. మార్చి 31 న భార్యతో గొడవపడి డబ్బులు కావాలని అన్నాడు.
ఇప్పటినుండి మంచిగా ఉంటానని చెప్పగా లేదు నువ్వు మద్యం తాగి ఉన్నావు ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వను పెద్దమనుషులను తీసుకురా అప్పుడు నీతో నేను కలిసి ఉంటానని చెప్పడంతో అక్కడినుంచి వెళ్ళిపోయి కొద్ది దూరంలో ఉన్న బెల్డు షాపులలో మందు తాగి వచ్చి డబ్బులు కావాలని గొడవపడి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
అరుణ కిరాణా షాపుల్లో బజ్జీలు అమ్ముతున్న సమయంలో ఉల్లిగడ్డలు కట్ చేసే కత్తితో తీసుకొని మెడలో రెండు వైపులా కోయడంతో రక్తం మాడుగులతో కొట్టుమిట్టాడుతూ రోడ్డు మీద పడింది. కొద్దిసేపటికి మృతి చెందడం జరిగింది.
అక్కడి నుండి నిందితుడు కొడతారు అనే భయంతో పారిపోవడంతో నేరసును గురించి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ నల్గొండ పర్యవేక్షణలో దేవరకొండ ఏఎస్పి మౌనిక ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి సిఐడి రాజు, గుర్రంపూడ్ ఎస్సై మధు, కానిస్టేబుల్ కావలి నరసింహ, నాగరాజు,నాగార్జున రెడ్డి, సైదులు, మూడు బృందాలుగా ఏర్పడి నేరస్తుని గురించి వెతుకుతుండగా నేరస్థున్ని పట్టుబడి దేవరకొండ కోర్టుకు రిమాండ్ కు మించబడింది.
MOST READ :
-
Job Mela : జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5న మెగా జాబ్ మేళా..!
-
Groups : గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన ఆర్టీసి బిడ్డలు.. సన్మానించిన ఆర్టీసీ ఎండి సజ్జానార్..!
-
Nalgonda : పల్లెనిద్రలో ASP.. కేసులు, చట్టాలు, విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ పట్ల అవగాహణ..!
-
Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)
-
Kusthi : రసవత్తనంగా కుస్తీ పోటీలు.. గెలుపొందిన దత్తు పైల్వాన్..!









