Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్రాజకీయం

Indiramma Gruhalu : నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. మంత్రి రాజనర్సింహ వెల్లడి..!

Indiramma Gruhalu : నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. మంత్రి రాజనర్సింహ వెల్లడి..!

అందోలు, మనసాక్షిః

రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని . రైతన్నల ఆదరణతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం.. అన్ని సబ్సిడీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తాం.. ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు.

ఆదివారం . ఏ ఒక్క రైతు కూడా అధైర్య పడవద్దు అని కోరారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఆదివారం జోగిపేట పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ లు హాజరయ్యారు.

నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి శాలువా పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వేదికపై ప్రసంగించారు.ఆందోల్‌ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.

టెండర్‌ ప్రక్రియ పూర్తవగానే ఆ పనులు ప్రారంభమవుతాయన్నారు. నాందేడ్‌ అకోలా జాతీయ రహదారి పైన అనుకోకుండా జరిగే ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా అత్యవసర ఆసుపత్రి సేవ కేంద్రాల్లో వైద్యులను, అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రమాదానికి గురైతే వెంటనే గాయపడిన వారిని ఆంబులెన్స్‌ ప్రమాద చోటుకు చేరుకొని 15 నిమిషాల్లో ఆస్పత్రికి చేర్చి వైద్యులచే చికిత్స అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నట్లు ఆయన అన్నారు.

అల్లాదుర్గం నుండి మెటల్‌ కుంట వరకు హైవే రోడ్డు పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వటపల్లి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఆందోల్‌ నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం అన్నారు. జోగిపేటకు నర్సింగ్‌ కాలేజ్, 150 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ మంజూరయ్యాయి. సింగూర్‌ లైనింగ్‌ కాల్వపనులకు 168 కోట్ల నిధులు మంజూరయ్యాయి అన్నారు.

త్వరలోనే ఆ పనులకు శ్రీకారం చుడతామన్నారు. సింగూర్‌ డ్యాం ను పర్యాటక కేంద్రంగా మారుస్తామని.. పర్యటక కేంద్రంగా మారిస్తే చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జోగిపేటకు పీజీ కాలేజ్, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్, జేఎన్టీయూ కళాశాలలు తెచ్చిన ఘనత తమదేనన్నారు. కానీ గులాబీ ప్రభుత్వ హయాంలో హరీష్‌ రావు నియోజకవర్గం అయిన సిద్దిపేటకి జోగిపేట లోని పీజీ కాలేజీలో ముఖ్యమైన కోర్సులను తరలించుకుపోవడం బాధాకరం.. రెండే కోర్సులు ప్రస్తుతానికి ఉన్నాయి. వాటిని తిరిగి మళ్లీ తేస్తామన్నారు.

జోగిపేట అభివృద్ధి చెందాలన్నదే నా లక్ష్యం.. నా కళ అన్నారు. రుణమాఫీ ఆందోల్‌ నియోజకవర్గం లో 38,700 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో సుమారు మిగిలిన రెండు వేల మంది రైతన్నల ఖాతాలోకి రూ. 425 కోట్ల రుణమాఫీ సంపూర్ణంగా జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానిది అన్నారు.

అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అధికారుల హయాంలో జరుగుతుందని.. దీనిలో ఎలాంటి రాజకీయం, రాజకీయ వర్గాలకు తావు లేకుండా ఏ పార్టీలకు అతీతంగా సంబంధం లేకుండా ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏ శాఖలో ఖాళీ ఉన్నా ఆ జాబులను పూర్తి చేస్తున్నాం అన్నారు. అందులో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మార్కెట్‌ యార్డు పాలకవర్గం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసి, మార్కెట్‌ యార్డు కు పేరును తీసుకురావాలన్నారు.

రాష్ట్రంలోని జోగిపేట మార్కెట్‌ యార్డుకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా పాలకవర్గ సభ్యులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌ రెడ్డి, జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య, గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ అంజయ్య, జోగిపేట ఆర్డిఓ పాండు, తహసిల్దార్, విష్ణు సాగర్, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు చిట్టిబాబు, సురేందర్‌ గౌడ్, చందర్,దుర్గేష్, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సునీల్, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు