Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsతెలంగాణహైదరాబాద్

Hyderabad : పెట్రోల్ పోస్తుండగా ఆకతాయి ఎంత పని చేసిండు.. (వీడియో)

Hyderabad : పెట్రోల్ పోస్తుండగా ఆకతాయి ఎంత పని చేసిండు.. (వీడియో)

మన సాక్షి, నాచారం :

పెట్రోల్ పోస్తుండగా ఓ ఆకతాయి చేసిన పనికి ఒకసారిగా మంటలు లేచాయి. ఈ సంఘటన హైదరాబాదులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ ఓల్డ్ మీర్పేట్ చెందిన చందన్ కుమార్ తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంలో ఇండియన్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు. ఆ సమయంలో సిబ్బంది వేరే కస్టమర్కు బాటిల్ లో పెట్రోల్ పోస్తుండగా చందన్ కుమార్ సడన్గా జేబులోంచి లెటర్ తీసి వెలిగించాడు.

అంటించమంటారా అంటూ పెట్రోలు నింపుతున్న సిబ్బంది దగ్గరకు వచ్చి అంటించాడు. వెంటనే పెట్రోల్ గన్ కు మంటలను మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న సిబ్బంది భయాందోళనలకు గురై పరుగులు పెట్టారు. బంకులో ఉన్న వారంతా కూడా పరుగులు పెట్టారు.

వెంటనే సిబ్బంది అప్రమత్తమై బంకులో ఉన్న మంటలు ఆర్పే ఫోమ్ ఆపేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు సమాచారం అందించగా ఆకతాయిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

VIDEO

MOST READ : 

మరిన్ని వార్తలు