Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : అకాల వర్షంతో అపార నష్టం.. పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Miryalaguda : అకాల వర్షంతో అపార నష్టం.. పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇటీవల అకాల వర్షం భారీగా కురిసింది. ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా వరి పంటలు  నేలవాలాయి.  నియోజకవర్గంలోని మాడుగుల పల్లి, వేములపల్లి ,మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో వరి పంటలు నేలవాలాయి.

ఆరుగాలం కష్టపడి, పెట్టుబడి పెట్టిన రైతులకు వరి కోతలు వచ్చే సమయానికి ఈదురు గాలుల బీభత్సం వల్ల పంటలు నేలపాలయ్యాయి. దాంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కాగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో వరి పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు పంటచేలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులకు ఆయన భరోసా కల్పించారు. నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులకు ప్రభుత్వానికి తెలియజేసి పరిహారం అందేలా చర్యలు చేపడతానన్నారు. అన్నం పెట్టే రైతన్నకు మేము ఎప్పుడు అండగా నిలబడతామని ఇది రైతు ప్రభుత్వం అని పేర్కొన్నారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు