BREAKING: నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..!

ఎంబీబీఎస్, వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన నీట్-యూజీ 2024 ఎంట్రన్స్ లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) శాశ్వతంగా రద్దు చేయాలని, జాతీయ స్థాయి పరీక్ష విధానాన్ని రద్దు చేసి, రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ. ఏఐఎస్ఎఫ్. పిడిఎస్యు .ఎన్ ఎస్ యు ఐ .డి వై ఎఫ్ ఐ .పి వై ఎల్. సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.పట్టణంలోని కేజీ టూ పీజీ విద్యా సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాయి.

BREAKING: నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..!

నల్లగొండ, మనసాక్షి :

ఎంబీబీఎస్, వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన నీట్-యూజీ 2024 ఎంట్రన్స్ లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) శాశ్వతంగా రద్దు చేయాలని, జాతీయ స్థాయి పరీక్ష విధానాన్ని రద్దు చేసి, రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ. ఏఐఎస్ఎఫ్. పిడిఎస్యు .ఎన్ ఎస్ యు ఐ .డి వై ఎఫ్ ఐ .పి వై ఎల్. సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.పట్టణంలోని కేజీ టూ పీజీ విద్యా సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాయి.

ఈ సందర్భంగా ఆయా సంఘాల బాద్యులు ఇందూరు సాగర్,మల్లం మహేష్,కమ్మంపాటి శంకర్,బరిగెల వెంకటేష్,ముదిగొండ మురళి కృష్ణ,తరుణోజు సాయి తేజ* లు పాల్గొని మాట్లాడుతూ..దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని అన్నారు. నీట్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రజా ప్రతినిధుల హస్తం ఉన్నదని అందుకే విచారణ చేయడానికి వెనకడుతుందని అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలో బిహార్,యూపీ, గుజరాత్ లో రూ.34 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్రయించారని,ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని బీజేపీ మోడీ ప్రభుత్వం పై వారు మండి పడ్డారు..
నిట్ పరీక్ష ఫలితాలలో 67 మందికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని, నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందని స్పష్టంగా అర్థం అవుతున్నదని అన్నారు.

ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం చూస్తే.బీజేపీ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా అర్థమయితున్నదని అన్నారు.ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని అన్నారు.

మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు,విద్యార్థులు సమాధానం సమాధానం చెప్పాలన్నారు.మళ్ళీ నీట్ పరిక్ష నిర్వహించాలని,దోసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అన్నారు..ఆవులను అన్యాయం జరిగితే రోడ్లమీదికొచ్చి గగ్గోలు పెట్టె మతోన్మాదులు 24లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించి నీట్ పేపర్ లీకేజీ అవుతే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ALSO READBasara : చదువులలో కూలి బిడ్డ టాప్, బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక..!

కేంద్రం ప్రభుత్వన్ని నీట్ నిర్వహణంలో వివాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ ఎగ్జాం ను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని కోచింగ్ సెంటర్లు పేరుతో, కన్సల్టెన్సీల పేరుతో పెపర్ లికేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అమనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీ కి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని ,విద్యార్థులకు,దేశ ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలె పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గాదేపాక సూర్యతేజ, ఎస్ ఎఫ్ ఐజిల్లా నాయకులు కమ్మంపటి సాయి, తరుణ్, ఎన్ ఎస్ యు ఐ మైనస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పులుసు నాగార్జున, శరత్, గురువేందర్, శ్రీకాంత్, కళ్యాణ్,, పోలె వెంకట్, నవదీప్, కామల్ల సందీప్,రావన్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!