Nalgonda : ప్రజావాణిలో వినతుల వెల్లువ.. కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నబాధితులు..!
Nalgonda : ప్రజావాణిలో వినతుల వెల్లువ.. కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నబాధితులు..!
నల్లగొండ, మనసాక్షి :
నల్లగొండ కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన బాధితులు కలెక్టర్ కు వినతి పత్రాలు సమర్పిస్తూ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
మిర్యాలగూడ పట్టణంలో నివసించే రోజువారి కూలీలు. తోపుడుబండ్ల వ్యాపారం చేసుకునేవారు , పండ్ల వ్యాపారం చేసుకునేవారు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు. పెయింటర్స్ , లకు గత ప్రభుత్వం మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్ రూమ లను డ్రా పద్ధతి ద్వారా కేటాయించి , తమ దగ్గర 2023లో అప్పటి ప్రభుత్వం సంతకాలు ఆధార్ కార్డు తీసుకొని తమకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని మానవ హక్కుల పరిరక్షణ సంక్షేమ కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహమ్మద్ నాజర్ అలీ మీర్జా ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్లు ఇచ్చిన పాతబకాయలు చెల్లించాలని విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేది లేదని అంటూ పాఠశాల యాజమాన్యాలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలlo చేర్చుకోవడం లేదని ఆరోపిస్తూ బి కవిత రాజశేఖర్ సైదులు యాదయ్య వెంకటేశం శంకర్ వెన్నెల తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
అలాగే యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం వారసత్వ పట్టా భూములు కోల్పోయిన తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం లేదని డామర్ చర్ల మండల కేంద్రానికి చెందిన కే శ్రీను అశోక్ పాపయ్య, రామయ్య, నవీన్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కొంతమంది తమకు వయసు పైబడినందున తమ వారసులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇవ్వడం లేదని మీకైతే ఇస్తామని అంటున్నారని వాపోయారు.
MOST READ :
-
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అంబ భవాని ఎత్తిపోతల నిర్మాణ పనుల పరిశీలన..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!
-
TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!
-
ACB : రేషన్ కార్డు కోసం లంచం.. పట్టుకున్న ఏసీబీ..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!









