Miryalaguda : మిర్యాలగూడలో ఎనిమల్ బర్త్ కేంద్రం.. శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్..!

Miryalaguda : మిర్యాలగూడలో ఎనిమల్ బర్త్ కేంద్రం.. శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అన్ని రకాల జంతువుల సంక్షేమం, సంరక్షణకై మిర్యాలగూడ పట్టణం సమీపంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని (జంతు జననం నియంత్రణ కేంద్రం) ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం మిర్యాలగూడ సమీపంలోని అవంతిపురం వద్ద సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్ర నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల కాలంలో చిన్నారులపై వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. వీధి కుక్కల జనాభాను నియంత్రించేందుకు హైదరాబాదు లాంటి మహానగరంలో తప్ప ఎక్కడ జంతు జనన నియంత్రణ కేంద్రాలు లేవని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో మాదిరిగానే మిర్యాలగూడలో సైతం ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఎన్జీవో తో ఒప్పందం చేసుకొని నల్గొండ మోడల్ లాగే మిర్యాలగూడలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
మున్సిపాలిటీ తో పాటు, చుట్టుపక్కల కుక్కలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే ఈ ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో స్టెరిలైజేషన్ చేయించడం జరుగుతుందని తెలిపారు.ఒకవేళ కుక్కలకు స్టెరిలైజేషన్ చేయనట్లయితే కుక్కల జనాభా విపరీతంగా పెరిగిపోయి కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుందని అన్నారు.కుక్కలకు స్టెరిలైజేషన్ తో పాటు, వీధి కుక్కలు ,పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ ఇప్పించాలని, ప్రభుత్వ పశు వైద్యశాలలో ఉచితంగా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని చెప్పారు.
ఎవరైనా కుక్కకాటుకు గురైనట్లయితే తక్షణమే యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో యాంటీ రెబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతోపాటు, కుక్కలను పెంచుకునే యజమానులు కుక్కలకు టీకాలు వేయించడమే కాకుండా, ఇంట్లో ఉన్న వారందరూ టీకాలు వేయించుకోవాలని, కుక్కలకు ప్రతి సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ వేయించాలని అన్నారు. మిర్యాలగూడలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తర్వాత, దేవరకొండ మున్సిపాలిటీలో కూడా ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసే ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ద్వారా అన్ని రకాల జంతువులకు ఇంజక్షన్లు, స్టేరిలైజేషన్లు, జంతువులను సంరక్షించేందుకు అవకాశం ఉందని ,ముఖ్యంగా కుక్కల జనాభ నియంత్రణ ఆపరేషన్ చేయించే విధంగా ఏర్పాటు చేస్తున్న ఏబీసీ కేంద్రానికి అన్ని రకాల సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో కుక్కలు,కోతులతో పాటు, అన్ని రకాల జంతువుల సంక్షేమానికి అవకాశం ఉందని ,అన్ని జంతువులు సంరక్షించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కుక్క కాటు ప్రమాదమని, నిర్లక్ష్యం చేస్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, అందువల్ల కుక్క కరిచిన వెంటనే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలని , చిన్నారులు ,పెద్దలు కుక్కల బారిన పడకుండా అవగాహన కల్పించాలని కోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ మాట్లాడారు.
MOST READ :
-
Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..!
-
Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
-
ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!
-
Hospitals Siege : అనుమతి లేకుండా వైద్యం.. ప్రైవేటు ఆసుపత్రులు సీజ్..!
-
Peanuts : వేరుశెనగలు ఎన్ని తినాలి.. ఎక్కువ తింటే గుండెకు ప్రమాదమా..!









