Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : విజయవాడ హైవే పై మరో బస్సు దగ్ధం..!

Nalgonda : విజయవాడ హైవే పై మరో బస్సు దగ్ధం..!

మన సాక్షి, చిట్యాల :

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో మంగళవారం ఉదయం మరో బస్సు దగ్ధమైంది. కర్నూలులో బస్సు దగ్గమైన సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. హైవే – 65 పై చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

బస్సులో పొగలు అలుముకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను అందరిని అలర్ట్ చేశారు. దాంతో గమనించిన ప్రయాణికులు కిందికి దూకారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. దాంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగాలాండ్ రిజిస్ట్రేషన్ కు చెందిన విహారి ట్రావెల్స్ బస్సు గా గుర్తించారు. బస్సు దగ్దమైన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. NREGS : తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక..!

  2. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  3. ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!

మరిన్ని వార్తలు