NREGS : తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక..!

NREGS : తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపిడిఓ సత్తయ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ప్రజల భాగస్వామ్యం లేకుండానే అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు డిఆర్డిఓ బాలరాజు, జిల్లా విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధి హామీ అంబుడ్స్మన్ భోజిరెడ్డి, ఏపిడి రాజు, హాజరయ్యారు.
మండలంలో 33 గ్రామ పంచాయతీల పరిధిలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు రూ.5,05,77,924 నిర్వహించిన ఉపాధి హామీ పనుల పై అక్టోబర్ 26 నుచి నవంబర్ 09 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ లు నిర్వహించారు. ప్రజావేదికలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి సోమవారం నిర్వహించిన ప్రజావేదికలో అసలు ప్రజలు పాల్గొనలేరు.
కేవలం అధికారులు, ఉద్యోగులు మాత్రమే సమీక్ష సమావేశంల నిర్వహించారు. వాళ్ళే ప్రశ్నించుకోవడం మళ్ళీ వాళ్ళే జవాబులు చెప్పుకున్నారు. సమస్యలు ఉన్నాయని, పనికితగ్గ కూలీ రావడంలేదని, పనులు జరుగకున్న బిల్లులు డ్రా చేశారని, ఒకరికి బదులుగా మరొక్కరు పనిచేశారని ప్రశ్నించేవారు లేకుండపోయారు.
ఈ విధంగా కేవలం అధికారులు, ఉద్యోగులు మాత్రమే సామాజిక తనిఖీలు నిర్వహించుకుంటే తప్పిద్దాలు ఎలా బయటపడతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి కొమురయ్య, 11మంది డిఆర్పిలు, ఏపీవో నర్సింలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, అధికారులు ఉన్నారు.
MOST READ :
-
Indiramma Houses : అర్హులకు అందని ఇందిరమ్మ ఇండ్లు..!
-
VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!
-
ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!
-
TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!
-
District collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆ కోర్సులను చదివితే భవిష్యత్తు ఉంటుంది..!









