Breaking Newsతెలంగాణసంక్షేమం

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో 200 యూనిట్ల వరకు ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా పాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఉచిత విద్యుత్ అందిస్తుంది.

కానీ ప్రజాపాలనలో దరఖాస్తులలో తప్పులు నమోదు కావడం, కంప్యూటర్లలో తప్పులు అప్డేట్ చేయడంతో చాలామందికి నాట్ అప్లైడ్ అని రావడంతో జీరో కరెంటు బిల్లు రావడం లేదు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్నప్పటికీ వారు బిల్లు చెల్లించాల్సి వస్తుంది. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర గ్యారెంటీల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.

 

ALSO READ : BREAKING : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. పశు వైద్యశాల ఉద్యోగి సస్పెండ్..!

 

అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంపు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నారు. అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీని సైతం చేశారు. కాగా ప్రజా పాలన ద్వారా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజా పాలన దరఖాస్తులలో తప్పులు నమోదు కావడం వల్ల అర్హులైన వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. పేదలు అర్హులైన వారు సంక్షేమ పథకాల కోసం ఇంతకాలం పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కాగా ప్రభుత్వం అర్హులైన వారికి అన్ని సంక్షేమ పథకాలు అందించే దిశలో ప్రయత్నం చేస్తుంది.

అందుకుగాను ప్రజాపాలనలో తప్పులను సరిచేయడానికి ముందుగా ఎడిట్ ఆప్షన్ కల్పించిన ప్రభుత్వం మరోసారి 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకంలో నాట్ అప్లైడ్ అని ఆన్ లైన్ లో ఉన్న దరఖాస్తు దారులకు మరో అవకాశం కల్పించింది.

వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం కు వెళ్లి రేషన్ కార్డు, కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తు ఫారం ను తీసుకెళ్తే అధికారులు ఎడిట్ చేయనున్నారు.

LATEST UPDATE : 

ROR : రేపు తెలంగాణ నూతన ROR చట్టం ముసాయిదా బిల్లుపై చర్చ.. సూచనలు, సలహాలు ఇవ్వండి.. అందరికీ ఆహ్వానం..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

Suryapet : సూర్యాపేటలో మృతదేహాల కలకలం..!

Miryalaguda : ఆయకట్టులో కూలీల కొరత.. జోరుగా వరినాట్లు..!

అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!

మరిన్ని వార్తలు