Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిరాజకీయంహైదరాబాద్

TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!

TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!

చేవెళ్ల, (మన సాక్షి) :

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో విషాద సంఘటన నెలకొన్నది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్ గూడ ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ తో పలు పదవుల్లో పనిచేశారు. 1999, 2014 లో హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు.

1980లో స్థానిక వార్తా సంస్థ ఎన్ఎస్ఎస్ ను ఆయన ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

MOST READ : 

  1. Suryapet : సిఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టు దామోదర్ రెడ్డి పేరు..!

  2. Alumni : 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

  3. Nalgonda : రూ.10 వడ్డీ.. రూ.50కోట్లు వసూలు.. చివరికి కటకటాల్లోకి..!

  4. Suryapet : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే హెల్తీ ఫై ఆసుపత్రి లక్ష్యం..!

మరిన్ని వార్తలు