Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESఆంధ్రప్రదేశ్సినిమా

అందాల ముద్దుగుమ్మ అనుశ్రీ.. ఈమె తెలుగమ్మాయి..!

దేవగుడి మూవీ హీరోయిన్ అనుశ్రీ తొలి సినిమాలోనే చక్కటి హావబావాలతో ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులకు ముద్దుల తనయగా, అన్నకు చెల్లిగా, స్నేహితుడికి ప్రియురాలిగా, శత్రువుల పాలిట శివంగిలా ఒకే పాత్రలో విభిన్న పార్స్వాలు చూపించారు. ఈమె తెలుగమ్మాయి.

అందాల ముద్దుగుమ్మ అనుశ్రీ.. ఈమె తెలుగమ్మాయి..!

మదనపల్లి,  మన సాక్షి :

దేవగుడి మూవీ హీరోయిన్ అనుశ్రీ తొలి సినిమాలోనే చక్కటి హావబావాలతో ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులకు ముద్దుల తనయగా, అన్నకు చెల్లిగా, స్నేహితుడికి ప్రియురాలిగా, శత్రువుల పాలిట శివంగిలా ఒకే పాత్రలో విభిన్న పార్స్వాలు చూపించారు. ఈమె తెలుగమ్మాయి.

సినిమాలో హైలెట్ నటనతో ప్రత్యేకతను చాటారు. బావోద్వేగాలతో కూడిన ఎమోషన్స్ పాటు సెంటిమెంట్స్ పండించారు. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్ గా నటన ప్రదర్శించారు. విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం గురించి శనివారం ఆమె మాట్లాడుతూ తొలి సినిమాలోనే టాలెంట్ నిరూపించుకునే పాత్ర రావడం సంతోషంగా ఉందన్నారు.

అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బెల్లం రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఆద్యంతం ఈమె చుట్టూ తిరుగుతుంది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో అందచందాలతో ఆకట్టుకుంది. తొలి సినిమాలోనే సత్తా చాటింది. అభిమానులను సంపాదించుకుంది. ప్రేక్షకుల మెప్పు పొందారు. ఓరచూపులతో కుర్రకారును ఓ రేంజ్ లో ఆకర్షించారు.

ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా రానించగలరని, తొలి మూవీ బెస్ట్ మూవీ కావడం సంతోషంగా ఉందన్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద టాక్ తెచ్చుకుంది. మంచి సినిమాను తెలుగువారు ఎప్పుడూ ఆదరిస్తారు. తారాగణం చిన్నా పెద్దా అన్నది చూడరు. కథ బాగుంటే అక్కున చేర్చుకుంటారు. దేవగుడి సినిమాలో అదే జరిగింది. సినియా ఆద్యంతం బాగుంది. ప్రేక్షకులకు కట్టి పడేసింది.

కొత్త తారాగణం కావడంతో తొలి రోజు ఆషామాషీగా భావించారు. కథ, కథనంతో పాటు మాటలు, పాటలు, సంగీతం, యాక్షన్, సన్నివేశాలు బాగుండడంతో ఈ చిత్రాన్ని ఆదరించడం మొదలు పెట్టారు. కొత్త అవకాశాలు రాగలవని బావిస్తున్నారు. తొలి సినిమాలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర బాషల సినిమాల్లో కూడా అవకాశాలు రాగలవని దీమా వ్యక్తం చేస్తున్నారు.

By : KodandaRamreddy

MOST READ 

  1. Gold Price : ఊహించని రీతిలో మళ్లీ వేలల్లో పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  2. Hyderabad : ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు.. రూ.6 లక్షలు చోరీ, సీసీటీవీలో రికార్డు..!

  3. Miryalaguda : చివరి నిమిషంలో షాక్.. మున్సిపల్ బరిలో ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు..!

  4. Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

మరిన్ని వార్తలు