తెలంగాణBreaking Newsసంక్షేమంహైదరాబాద్

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే.. మీరు అర్హులేనా..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే.. మీరు అర్హులేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

తెలంగాణలో పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు పాత వాటిలో పేర్లు మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే కొత్త రేషన్ కార్డులకు అర్హతలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకోవడానికి మీరు అర్హులేనా అనే విషయం నిబంధనలను చూడాల్సి ఉంది.

పెళ్లైన కొత్తజంటలకు వారి ఆధార్ కార్డులతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా పిల్లల పేర్లు రేషన్ కార్డులో నమోదు చేయించడానికి వారి పుట్టినరోజు సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. ఆయా సర్టిఫికెట్లతో మీ సేవ కేంద్రాలలో నమోదు చేసుకోవచ్చును.

ఇక కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల రూపాయల ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండాల్సి ఉంది. అదేవిధంగా 3.20 ఎకరాల మాగాణి, 7.20 ఎకరాల మెట్ట ఉంటేనే రేషన్ కార్డులు జారీ చేస్తారు. కానీ ఈసారి ఏమైనా మార్పులు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేయనున్నది. మొదటిది అంత్యోదయ ఆహార భద్రత కార్డు, రెండవది ఆహార భద్రత కార్డు, మూడవది అంత్యోదయ అన్న యోజన కార్డు ఉంటుంది. మొదటి రకం కార్డుకు 6 కిలోల బియ్యం, రెండో రకం కార్డుకు 10 కిలోల బియ్యం, మూడో రకం కార్డుకు 35 కిలోల బియ్యంను అందజేస్తారు.

ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డుల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఆ తర్వాత వివాహం అయినవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు