తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావ్యవసాయం

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ యోజనకు దరఖాస్తులు.. మీసేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రధాన మంత్రి కిసాన్ యోజనను జిల్లా రైతులకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. 2019 ఫిబ్రవరి 1 కంటే ముందే భూమి ఉన్నప్పటికీ పాస్‌బుక్ రాలేకపోవటం వల్ల జిల్లాలో చాలా మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందడం లేదని, అలాంటి రైతులు ఇప్పుడు మీ -సేవ లేదా సాధారణ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు పి ఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన రైతులకు పి ఎం కిసాన్ యోజన పథకాన్ని వర్తింపచేయాలన్నారు.

మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, సీ ఎస్ సీ కేంద్రాల నిర్వాహకులు పిఎం కిసాన్ యోజన పోర్టల్ ను ఒకటికి రెండుసార్లు పరిశీలించి రైతుల వివరాలను అప్ లోడ్ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ రైతు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో పాటు లింక్ డాక్యుమెంట్ (మాకు భూమి 2019 కంటే ముందే ఉందని నిర్ధారించే పహాణి, ఆర్ వో ఆర్ ) తో జటపర్చి పిఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఏమైనా అనుమానాలు ఉంటే మండల వ్యవ సాయ శాఖ అధికారులు, ఏ.ఈ.ఓ తో నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే పిఎం కిసాన్ యోజన పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని రైతుల కు ఆ పథకాన్ని వర్తింప చేయడానికి ఏవోలు,
ఏఈ వోలు మీ సేవా, సీ ఎస్ సీ కేంద్రాల నిర్వాహకులు కృషి చేయాలని ఆయన కోరారు. ఒక వేళ రైతు చనిపోతే వారసత్వంగా వారి పిల్లలకూ పథకం వర్తిస్తుందని, అలాంటివారు తమ తండ్రికి పిఎం కిసాన్ యోజన లబ్ధి పొందినట్లు ప్రూఫ్ పెడితే సరిపోతుందని ఆయన తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు