APSRTC : ముగిసిన ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ శిక్షణ తరగతులు..
మదనపల్లి పట్టణం ఎన్జీవో హోమ్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఆదివారం అత్యంత విజయవంతంగా ముగిశాయి. చిత్తూరు, తిరుపతి, మరియు అన్నమయ్య జిల్లాల నుండి అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు ఈ శిక్షణలో పాల్గొని వక్తల ప్రసంగాలను ఆలకించారు.

APSRTC : ముగిసిన ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ శిక్షణ తరగతులు..!
మదనపల్లి రూరల్, మన సాక్షి:
మదనపల్లి పట్టణం ఎన్జీవో హోమ్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఆదివారం అత్యంత విజయవంతంగా ముగిశాయి. చిత్తూరు, తిరుపతి, మరియు అన్నమయ్య జిల్లాల నుండి అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు ఈ శిక్షణలో పాల్గొని వక్తల ప్రసంగాలను ఆలకించారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సంస్థ ప్రస్తుత స్థితిగతులు మరియు ఉద్యోగుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల హక్కుల రక్షణలో అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. నాయకులు నిత్యం ఉద్యోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. లీడర్‌షిప్ క్వాలిటీస్ (నాయకత్వ లక్షణాలు) మరియు క్షేత్రస్థాయిలో చేయవలసిన సంక్షేమ సేవల గురించి ఆయన వివరించారు.
ALSO READ : Shankarpally : వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి శంకర్‌పల్లి బృంద నృత్యం..!
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ.. పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించి, ఉద్యోగులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలిచ్చారు.
డిపార్ట్‌మెంట్ అంశాలపై రాష్ట్ర ఉపాధ్యక్షులు హరి మోహన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు వినోద్ బాబు, రాష్ట్ర నాయకులు బాబు, చెంచులయ్య, మహేశ్వరి, రత్నం మరియు ఉమ్మడి జిల్లాల రీజినల్ కార్యదర్శులు, వివిధ డిపోల నాయకులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు సాగిన ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
MOST READ :
- Ration Cards : రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త..!
- Suryapet : సూర్యాపేట జిల్లాలో సైబీరియన్ అందాలు.. 30 ఏళ్లుగా ఆతిథ్యం ఇస్తున్న కొత్తగూడెం చెరువు..!
- Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. ఈరోజే చివరి తేదీ, అలా చేయకుంటే పథకాలు, రాయితీలు అందవు..!
- Breaking : బస్తా యూరియా కోసం బారులు.. ఆలూర్ సొసైటీ వద్ద రైతుల పాట్లు..!









