Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : నల్గొండలో అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆత్మహత్య..! 

BREAKING : నల్గొండలో అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆత్మహత్య..! 

నల్లగొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఈనెల 22వ తేదీన ఆత్మహత్యయత్నానికి పాల్పడగా 23వ తేదీన మృతి చెందాడు. మృతికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది.

ఈనెల 22వ తేదీన నల్గొండ పట్టణం, అప్పాజీపేట కి చెందిన అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కేతారపు రాజు (36), షాద్ నగర్ నుండి బదిలీ పై నల్లగొండకు వచ్చారు. నల్గొండ ఫైర్ ఆఫీసులో రిపోర్ట్ చేసి మద్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తన ఇల్లు  కథాలగూడ, గ్రీన్ సిటీ కాలనీ లో తన ఇంటికి వెల్లి గడ్డి మందు తాగినాడనీ దీంతో ఆయనను, ఐ కాన్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స జరుపుతుండగా మంగళవారం  23న చనిపోయాడు.

వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అతని తండ్రి కేతారపు కృష్ణయ్య పిర్యాదు లో గత కొంత కాలంగా తన కొడుకుకి, కోడలు కి కుటుంబ పరమైన విషయాలలో గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ కలహాల కారణంగా జీవితం పై విరక్తి చెంది గడ్డి మందు తాగి చనిపోయినాడని తెలిపినాడు. అతని తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగినదని ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  తెలిపినారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు