BIG BREAKING : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం..!
BIG BREAKING : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం..!
నల్లగొండ, మన సాక్షి :
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కుర్చీలోనే ప్రసవించిన సంఘటన జరిగింది.
వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన గర్భిణీ నల్లవెల్లి అశ్విని భర్త ఆంజనేయులుతో కల్సి గురువారం రాత్రి నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీ కోసం వెళ్తే.. అక్కడ డాక్టర్లు లేరని.. నల్గొండ కి తీసుకెళ్ళాలి అని భయబ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పంపించారు.
అక్కడి నుంచి అంబులెన్స్ లో నల్గొండ జిల్లా ఆసుపత్రికి వస్తె ఇక్కడికి ఎందుకు వచ్చారు. మూడో కాన్పు కి దేవరకొండలో చేయించక అని తిట్టారు. ఈ క్రమంలో అశ్వినీని బయట కుర్చీ లోనే కూర్చోబెట్టారు నర్సులు. నొప్పులు వస్తున్నాయని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు..
తీవ్ర నొప్పులతో బాధ పడుతూ కుర్చీలోనే డెలివరి అయింది. కుర్చీ కింద తీవరక్త స్రావం జరిగింది. అప్పుడు అందరూ వచ్చి హడావిడి చేసి తిరిగి పేషెంట్ పేరెంట్స్ నీ తిట్టడం గమనార్హం. దీనికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని గర్భిణీ భర్త కలెక్టర్ ను కోరారు.
LATEST UPDATE :
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!
Revanth, Batti : పిసిసి చీఫ్ అతడే.. ఇక మంత్రులు కూడా ఖరారు.. ఢిల్లీకి చేరిన రేవంత్, భట్టి..!
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!









