Civil Supply : సివిల్ సప్లై అధికారుల దాడులు.. పెట్రోల్ బంకు సీజ్..!
Civil Supply : సివిల్ సప్లై అధికారుల దాడులు.. పెట్రోల్ బంకు సీజ్..!
పెద్దపల్లి,, మన సాక్షి:
లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేశామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి లైసెన్సు లేని కారణంగా సీజ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ మాట్లాడుతూ, తనిఖీలలో భార్గవి సర్వీస్ స్టేషన్ (యజమాని వి.రమేష్ ) ఫారం బీ లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు గమనించి సీజ్ చేశామని అన్నారు. పెట్రోల్ బంక్ లో 20 లక్షల 37 వేల 248 రూపాయల విలువ గల ఉన్న 9992 లీటర్ల పెట్రోల్, 10,022 లీటర్ల డీజిల్ లను కూడా సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ తనిఖీలలో డిప్యూటీ తహసిల్దారులు సంతోష్ సింగ్ ఠాగూర్, రవీందర్,సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.
MOST READ :
-
Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం..!
-
Huzurnagar : సూర్యాపేట జిల్లాలో సంచలనం కలిగించిన అత్యాచారం, దాడి కేసులో పోలీసుల కీలక చర్య..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..!









