Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

జహీరాబాద్ లో ఘోరం.. కన్న తండ్రిని హత్య చేసిన తనయుడు..!

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కన్నతండ్రిని భార్య, కుమారుడే దారుణంగా హతమార్చారు.

జహీరాబాద్ లో ఘోరం.. కన్న తండ్రిని హత్య చేసిన తనయుడు..!

జహీరాబాద్, మనసాక్షి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కన్నతండ్రిని భార్య, కుమారుడే దారుణంగా హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం బుచ్చనపల్లికి చెందిన తాజోద్దీన్ (60) కొంతకాలంగా జహీరాబాద్ లోని భరత్ నగర్ లో కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

తాజుద్దీన్ కు ఆస్తి పంపకం విషయంలో కుమారుడు భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కుటుంబ సభ్యులు తాజుద్దీన్ పై దాడికి దిగారు. నిందితులు ముందుగా కళ్ళల్లో కారం చల్లి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి తాజుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీఐ శివలింగం, ఎస్సై వినయ్ కుమార్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దాటికి పాల్పడిన భార్య కుమారున్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

మరిన్ని వార్తలు