Elections : విందు భోజనాలు, బహుమతుల పంపిణీ.. ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన..!

Elections : విందు భోజనాలు, బహుమతుల పంపిణీ.. ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన..!
కరీంనగర్, మనసాక్షి :
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే ధ్యేయంగా సర్పంచి అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఊళ్లో సామాజిక వర్గాల వారిగా పోటాపోటీ సమావేశాలు నిర్వహించి.. ఓట్లు గంపగుత్తగా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హామీలు గుప్పించడంతో పాటు కోరిన డబ్బులను అందింస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి తనకు వచ్చిన గుర్తును గ్రామ ప్రజలకు బహుమతిగా అందజేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న అభ్యర్థి ఆదివారం గ్రామంలో సుమారు 1000 మంది గ్రామస్థులతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో తాను గతంలో గ్రామ సర్పంచ్ గా పదవిలో ఉన్నపుడు తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.
అంతే కాకుండా తనను మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ఈ సభ అనంతరం వచ్చిన ఓటర్లకు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా ఏకంగా తనకు వచ్చిన కత్తెర గుర్తుని దృష్టిలో పెట్టుకుని మహిళలను ప్రలోభ పెట్టేందుకు జాకెట్ పీసులు, కత్తెరలను బహుమతిగా పంపిణి చేశారు.
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలనే మోడల్ ఆఫ్ కండక్ట్ అని అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే, ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవచ్చు.
ఈ నియమాలను ఉల్లంఘించినవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్ కేసును దాఖలు చేయవచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రవర్తన, ఎన్నికల సభ, ర్యాలీ, ఊరేగింపు, రోడ్ షోలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు ఉంటాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అభ్యర్థులు లేదా పార్టీలు ప్రజలకు అనుచితంగా ఆకర్షణలు, బహుమతులు, డబ్బు, మద్యం, వస్తువులు ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. ఓటర్లను ప్రభావితం చేసే ప్రకటనలు, వాగ్దానాలు చేయకూడదు. ఈ సంఘటనపై ఎన్నికల అధికారులు ఎం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
MOST VIEWS
-
TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..!
-
TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!
-
TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!










