Miryalaguda : శిష్య స్కూల్ లో దసరా, బతుకమ్మ సంబరాలు..!

Miryalaguda : శిష్య స్కూల్ లో దసరా, బతుకమ్మ సంబరాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్ లోని శిష్య ది స్కూల్ లో అంగరంగ వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ శాగ జయలక్ష్మి, జలంధరెడ్డి, రిటైడ్ తెలుగు ఉపాధ్యాయులు రావిరాల అంజయ్య, నందికొండ చంద్రయ్య ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శిష్యదిస్కూల్ ప్రిన్సిపాల్ అల్లుబెల్లి శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్ అల్లుబెల్లి శిరిషా పాల్గొనడం జరిగింది. దసరా ఉత్సవాలలో భాగంగా శిష్య విద్యార్థులు వివిధ దుర్గా మాతా వేషాధారణలతో అందరిని అలరించి, ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, శిరీషా మాట్లాడుతూ బతుకమ్మ పండుగల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, తెలంగాణ ఆచార సాంప్రదాయాల గురించి చాలా చక్కగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలంగాణ భాషలో వివరించడం జరిగింది.
ఇట్టికార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ముందస్తు బతుకమ్మను ఎంతో చక్కగా రంగురంగుల పూలతో పెర్చారు. కార్యక్రమంలో ప్రథమ బహమతి మన్విత, అక్షర ద్వితీయ బహుమతి, భవిత తృతీయ బతుమతులను పొందారు. ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ చేతుల మీదుగా విద్యార్థులకు అందచేయడం జరిగింది.
MOST READ :
-
Trump : H1B వీసా అంటే ఏమిటి.. ఎవరికి వస్తుంది.. ట్రంప్ సంచలన నిర్ణయం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను కేటాయింపుకు తీర్మానం..!
-
Hyderabad : కోకాపేట్ లో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..!
-
Additional Collector : సాదాబ్ బై నామాలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారికి నోటీసులు ఇవ్వాలి..!
-
Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!









