TOP STORIESBreaking Newsజాతీయం

Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

మన సాక్షి వెబ్ డెస్క్ :

సైబర్ మోసగాళ్లు అనేక రకాలుగా అమాయక ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేరిట సైబర్ స్కామర్లు రెచ్చిపోతున్నారు.

మీ ఫోన్ కు ఆర్బిఐ పేరుతో ఫోన్ కాల్ రావడం గానీ, వాట్సాప్ లో మెసేజ్ లు రావడం కానీ జరుగుతున్నాయి. వాటికి మీరు ట్రాప్ లో పడి రిప్లై ఇస్తే ఇక మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయినట్టే.. అయితే ఇలాంటి కాల్స్ వస్తే, మెసేజ్ లు వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం…

సైబర్ స్కామర్లు ఇలా కాల్ చేస్తారు :

మీకు ఆర్బిఐ నుంచి రోబోటిక్ వాయిస్ కాల్ వస్తుంది. హిందీలో మాట్లాడతారు. మీ బ్యాంకు ఎకౌంటు నుంచి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని, మీ బ్యాంకు ఖాతా నిలిపివేస్తున్నట్లుగా హెచ్చరించి భయాందోళనలకు గురిచేస్తారు. అయితే మీరు మీ వివరాలకు ఆర్బిఐ ఆపరేటర్ తో మాట్లాడాలని.. మీరు మాట్లాడడానికి మీ ఫోన్లో తొమ్మిది నెంబర్ నొక్కమని చెబుతారు.

అయితే ఆ నెంబర్ నొక్కగానే ఆర్బిఐ అధికారిని అంటూ స్కామర్ మాట్లాడుతూ మిమ్ములను ట్రాప్ లోకి పెడతాడు. ఒక్కోసారి మీ ఆధార్ నెంబర్, క్రెడిట్ కార్డు వివరాలు కూడా చెబుతుంటాడు. అవి చెప్పగానే మీరు నమ్ముతారు. ఆ తర్వాత స్కామర్లు ఓటిపి, సివివి, క్రెడిట్ కార్డు నెంబరు, నెట్ బ్యాంకింగ్ వివరాలను, మిగతా వివరాలను అడుగుతుంటాడు.

ఆ తరువాత వాట్సాప్ లో టెక్స్ట్ మెసేజ్ ల రూపంలో రిమోట్ యాక్సెస్ ఇచ్చే ఫైల్స్ ను పంపుతారు. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతారు. వాటిని మీరు డౌన్ లోడ్ చేసుకుంటే ఆ తర్వాత మీ బ్యాంకు ఖాళీ చేస్తారు.

స్కామర్లు కాల్ చేస్తే ఏం చేయాలి?

వాస్తవానికి ఆర్బిఐ అధికారుల పేరుట కాల్స్ వస్తే మొట్టమొదట వెంటనే కాల్ కట్ చేయండి. వాట్సాప్ లో మెసేజ్ వచ్చిన ఎలాంటి ఓపెన్ చేయకుండా వాటిని డిలీట్ చేయండి. ఎందుకంటే ఆర్బిఐ నుంచి ఎవరికీ ఫోన్లు, మెసేజ్ లు రావు. ఎవరికి కూడా ఐడీలు, బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలను షేర్ చేయవద్దు.

అనుమానాస్పదంగా లావాదేవీలను పర్యవేక్షించమని వస్తే బ్యాంకుకు తెలియజేయండి. మీ అకౌంట్ నుంచి ఏవైనా లావాదేవీలు జరిగితే మీకు తెలియజేయడానికి ఎస్ఎంఎస్ అలెర్ట్ ను యాక్టివేట్ చేసుకోండి.

అదేవిధంగా మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏదైనా లాగిన్ సమాచారాన్ని స్కామర్ తో పంచుకుంటే వాటిని వెంటనే పాస్వర్డ్ మార్చేయండి. ఇంకా ఏదైనా మీరు సమాచారం ఇచ్చినట్లయితే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయండి. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చును.

MOST READ :

  1. Video call : రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్.. రూ. 30 లక్షలు కొట్టేశారు..!

  2. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

  3. Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

  4. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)

  5. Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!

మరిన్ని వార్తలు