Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking News

Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!

Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ దారులకు శుభవార్త తెలియజేసింది. ఎంతోకాలంగా ఆసరా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది. కొత్త పింఛన్ల కోసం అర్హులైన జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం తెలంగాణలో ఆసరా పింఛన్ల పథకం కింద 42.96 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వారిలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలతో పాటు వివిధ రకాల వారు ఉన్నారు. సాధారణ పింఛన్లు నెలకు 2016 రూపాయలు, వికలాంగులకు 4016 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా 5.20 లక్షల మంది పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. పింఛను లబ్ధి పొందే వ్యక్తి చనిపోతే ఆయన భార్య వితంతు పింఛన్ కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు చేయలేదు.

ఇటీవల పింఛన్లపై పేదరిక నిర్మూలన సంస్థ సమీక్ష నిర్వహించింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు పెండింగులో ఉన్న దరఖాస్తుదారులకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు, పట్టణాలు, నగరాలలో బిల్ కలెక్టర్ల ద్వారా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల పరిశీలన చేయాలని పేర్కొన్నది. దాంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ దారులకు త్వరలో పింఛన్ రాబోతున్నది.

ఇవి సూచనలు :

వృద్ధాప్య పింఛను పొందుతూ లబ్ధిదారుడు మరణిస్తే వారి జాబితా ఆధారంగా పరిశీలించి వారి భార్యలకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితా సిద్ధం చేయాలి. అందుకు గాను పెన్షనర్ ఐడి, మరణ ధ్రువీకరణ పత్రం, మృతుడి భార్య ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి.

MOST READ :

  1. Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

  2. Miryalaguda : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష.. పోలీసులకు ఫిర్యాదు..!

  3. Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!

  4. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)

  5. అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!

  6. Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు