కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం..!
బాకీ తీర్చాలని కోరగా.. కంకర రాళ్లకు బంగారం పూత పూసి ఇచ్చిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బాకీ తీర్చాలని కోరగా.. కంకర రాళ్లకు బంగారం పూత పూసి ఇచ్చిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్ వద్ద రూ.1.30 లక్షలు శ్రీనివాస్ అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని శ్రీనివాస్ పై రమేష్ ఒత్తిడి తెచ్చాడు. దాంతో తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారం రాళ్లు ఉన్నాయని శ్రీనివాస్ చెప్పి బంగారు రాళ్లను అప్పు కింద కట్టుకోమని రమేష్ ను నమ్మించాడు.
నిజామాబాద్‌లో కాకుండా డిచ్‌పల్లి మండలం ఘన్ పూర్ కి అదనంగా రూ.32 వేలు తీసుకొని రావాలని రమేష్ కు శ్రీనివాస్ సూచించాడు. నాలుగు కుండల్లో నాలుగు బంగారం రాళ్లను రమేష్ కు శ్రీనివాస్ అందించాడు. అనుమానం వచ్చి చూడగా.. కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినట్లు బాధితుడు రమేష్ గుర్తించి, మోసపోయానని గ్రహించి డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
MOST READ
- Ration Cards : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట..!
- District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. లిఫ్టుల రక్షణ రైతులదే బాధ్యత..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. లేటెస్ట్ అప్డేట్..!
- District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. లిఫ్టుల రక్షణ రైతులదే బాధ్యత..!









