విశాఖలో హత్య.. ఒడిశాలో మృతదేహం..!
మైనర్ బాలికను ఆటోడ్రైవర్ హత్య చేసి ట్రాలీ బ్యాగ్ లో కుక్కి న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

విశాఖలో హత్య.. ఒడిశాలో మృతదేహం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మైనర్ బాలికను ఆటోడ్రైవర్ హత్య చేసి ట్రాలీ బ్యాగ్ లో కుక్కి న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. విశాఖలో హత్య చేసి ఒడిశాలో మరితదేహం వదిలేసిన ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. కంచరపాలెం దుర్గానగర్ కు చెందిన బొలిశెట్టి సురేష్ ప్రేమ పేరుతో సంధ్య అనే బాలికను లోబరుచుకున్నాడు. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాట దాటవేస్తూ సురేష్ కాలం గడిపాడు. చివరికి సహనం కోల్పోయి పెళ్లి చేసుకోవాలంటూ సురేష్ ను గట్టిగా నిలదీయడంతో సంధ్య గొడవ పడింది.
ఇద్దరి మధ్య వాగ్వాదం.. తీవ్ర కోపద్రిక్తుడై సురేష్ దాడి చేయడంతో సంధ్య మృతి చెందింది. ఆధారాలు మాయం చేసే ఉద్దేశంతో సూట్ కేసులో మృతదేహాన్ని దాచి ఒడిశా తీసుకెళ్లాడు. జ్ఞానపురం రైల్వే స్టేషన్ నుండి రైలులో ఒడిశాలోని రాయగడ్ కు తీసుకెళ్లి చాందిని పోలీస్ స్టేషన్ పరిధిలో సూట్ కేసును వదిలేశాడు. అదే రోజు రాత్రి సురేష్ విశాఖకు వచ్చాడు.
కాగా సూట్ కేసులో మృతదేహం లభించడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే సురేష్ ఆమెను హత్య చేశాడని తెలిసింది. అతన్ని అరెస్టు చేసి పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు.









