Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి వారోత్సవాలు

అన్నమయ్య జిల్లా డాక్టర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. దిగువపేట హెచ్ పి పెట్రోల్ బంక్ నుండి ఎమ్మెల్యే, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు యమల సుదర్శన్ కు మండల మాలమహానాడు అధ్యక్షులు టి. కృష్ణప్ప అంబేద్కర్ యువసేన సభ్యులు మేళతాలలతో, జానపద కళాకారులతో పూల వర్షం కురిపిస్తూ గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు.

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి వారోత్సవాలు

పాల్గొన్న ఎమ్మెల్యే షాజాహాన్ బాషా

ఘనస్వాగతం పలికిన మాలమహానాడు అధ్యక్షులు టి. కృష్ణప్ప 

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా డాక్టర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. దిగువపేట హెచ్ పి పెట్రోల్ బంక్ నుండి ఎమ్మెల్యే, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు యమల సుదర్శన్ కు మండల మాలమహానాడు అధ్యక్షులు టి. కృష్ణప్ప అంబేద్కర్ యువసేన సభ్యులు మేళతాలలతో, జానపద కళాకారులతో పూల వర్షం కురిపిస్తూ గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. టిడిపి సీనియర్ నాయకులు అప్పి స్వామి తనయుడు చిన్ను స్వామి శాలువ కప్పి, పూలమాలలువేసి వారి నివాసానికి ఆహ్వానం పలికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దిగువ పేటనుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయం మరియు సమానత్వానికి ప్రతీక అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136 వ జయంతి వారోత్సవాలు సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక ఘన నివాళులు.
అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన మహోన్నత పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. సమాన హక్కులు, స్వేచ్ఛ న్యాయం అనే విలువలు ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే సాధ్యమవుతాయి.

ఆయన ఆశయాలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినవారమవుతామన్నారు .
జయ భీమ్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో మండల మాలమహానాడు అధ్యక్షులు కృష్ణప్ప,మాజీ జడ్పీటీసీ శివశంకర్, సీతారామ స్వామి చిన్ను స్వామి, పెద్ది రెడ్డి,కృష్ణం రాజు,రాజేష్ స్వామి, రూపేష్ రెడ్డి, అన్సర్ బాషా, ఎం. శంకరప్ప, బాలాజీ కొమ్మునారాయణ స్వామి, టిడిపి మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి,అరికల టమోటా మార్కెట్ రమణ,దిగువ హరిజన వాడ శంకర,ఎస్సి సెల్ అధ్యక్షులు శివ, నడింపల్లె రమేష్, డాక్టర్ జి శివకుమార్ రెడ్డి, వాహిద్, చాంద్ బాషా,టీచర్ నరసింహులు, కృష్ణప్ప మోహన్, ఊలపాడు శ్రీనివాసులు, లక్ష్మి నారాయణ, రఘుపతి, నాగరాజ, అశోక్, ప్రభాకర్, రామాంజులు,ఏ పీ ఎం సాంబ శివ డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై హృషికేశవ రెడ్డి పోలీస్ సిబ్బంది తో బందో బస్త్ నిర్వహించారు.

మరిన్ని వార్తలు