TOP STORIESBreaking Newsజాతీయం

UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!

UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!

మన సాక్షి వెబ్ డెస్క్:

అమాయక ప్రజలను మోసం చేసేందుకు స్కామర్లు కొత్త కొత్తగా ప్లాన్స్ వేస్తున్నారు. తాజాగా మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అదే ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఫేక్ యాప్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం…

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. ఐదు రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు కూడా డిజిటల్ చెల్లింపులను కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సైబర్ మోసగాళ్లు కూడా భారీగా పెరిగిపోయారు. మార్కెట్లోకి కొత్త కొత్త మోసాలతో బయటకు వస్తున్నారు.

అయితే ఇటీవల నకిలీ చెల్లింపుల యాప్స్ కూడా వచ్చాయి. వాటిని చూస్తే నిజమైన ఫోన్ పే గూగుల్ పే పేటియం మాదిరిగానే కనిపిస్తాయి. కానీ అవి నిజానికి ఫేక్ చెల్లింపుల యాప్స్. ఆ యాప్స్ డబ్బులు పంపిన తర్వాత నోటిఫికేషన్ పంపించినట్లుగా చూపిస్తాయి. కానీ డబ్బుల చెల్లింపులు మాత్రం జరగవు.

ఇలాంటి మోసాల గురించి :

ఇలాంటి చెల్లింపుల్లో మోసాల విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపయోగించి అనేకమంది మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చిన్న వ్యాపారులు ఈ మోసాల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో వ్యాపారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో మోసాలను గుర్తించి అవగాహన కలిగి ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. డబ్బులు రావు నోటిఫికేషన్ వస్తుంది. అయితే మార్కెట్లో ఈ నకిలీ యాప్స్ ద్వారా చెల్లించినట్లుగా నోటిఫికేషన్, సౌండ్ కూడా నిజంగా మాదిరిగానే వస్తుంది. కానీ డబ్బులు మాత్రం రావు.

ఈ నకిలీ యాప్ ను చాలా అదునాతనమైనవి కావడంతో వాటిని గుర్తించడానికి చిన్న చిన్న వ్యాపారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటిని అనేకమంది చిన్న వ్యాపారులు గుర్తించలేకపోతున్నారు. దాంతో చెల్లింపు పూర్తయినట్లుగా అనిపిస్తుంది. కానీ డబ్బులు మాత్రం ఖాతాలోకి రావు.

నకిలీ యాప్స్ ను ఎలా నివారించాలి :

స్కామర్లు వినియోగించే నకిలీ యాప్ లను ఎలా గుర్తించాలి అంటే వ్యాపారాలు కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యాపారులు బ్యాంకు లావాదేవీలను కూడా చెక్ చేయాలి. స్క్రీన్షాట్లు లేదా నోటిఫికేషన్ల పై మాత్రమే ఆధారపడకుండా బ్యాంకు ఖాతా చెక్ చేయాలి. లావాదేవీల్లో వ్యత్యాసాలు ఉన్నాయో..? లేదో పరిశీలించుకోవాలి. అంతేకాకుండా డబ్బులు పంపిన తర్వాత మీకు సమయం ఇవ్వని వ్యక్తుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

నకిలీ యాప్స్ గురించి :

సాధారణంగా ఉపయోగించే చెల్లింపు యాప్ ల గురించి తెలుసుకోండి. ఎవరైనా తెలియని యాప్ ద్వారా చెల్లింపు చేయమని అడిగితే జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా రద్దీగా ఉండే దుకాణాలలో గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఈ నకిలీ చెల్లింపుల యాప్లను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇలాంటి మోసపూరితమైన లావాదేవీల గురించి అవగాహన కలిగి ఉండాలి.

Similar News : 

  1. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  4. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  5. Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!

మరిన్ని వార్తలు