Nalgonda : రుణాలు ఇప్పిస్తామని భారీ మోసం.. నకిలీ బ్యాంకు అధికారుల ఆటకట్టు..!
Nalgonda : రుణాలు ఇప్పిస్తామని భారీ మోసం.. నకిలీ బ్యాంకు అధికారుల ఆటకట్టు..!
నల్లగొండ, మన సాక్షి.
నకిలీ బ్యాంక్ అధికారులుగా చలామణి అవుతూ రైతులను వ్యాపారస్తులను మభ్యపెడుతూ తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 7 మండలాలకు చెందిన 28 మంది రైతులను మోసం చేసినట్లు తెలిపారు.
అమాయక రైతుల వద్ద నుండి దాదాపు 26 లక్షల రూపాయలు వసూలు చేశారని దీనితో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పెద్దవూర మండలం వెలుగు గూడెం గ్రామానికి చెందిన కట్టబోయిన పరమేష్, మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన మమ్ముల జ్యోతి. నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన షేక్ వజీర్. మాడుగుల పెళ్లి మండలం చిరుమర్తి గ్రామానికి చెందిన కొండా శ్రీను. మిర్యాలగూడ బాపూజీ నగర్ కు చెందిన గోగుల సురేష్ .మిర్యాలగూడ మండలం జస్టి వీరప్ప గూడెం గ్రామానికి చెందిన చిలుముల సైదులు. పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామానికి చెందిన పల్లబోయిన నాగరాజు ముఠాగా ఏర్పడ్డారు.
వీరంతా గత కొంతకాలంగా నకిలీ బ్యాంక్ అధికారులుగా చలామణి అవుతూ రైతుల వద్దకు వెళ్లి వారి యొక్క భూములను తనఖ గా పెట్టుకొని తక్కువ వడ్డీరేట్లకే బ్యాంకు నుండి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని చెప్పేవారు.
వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులుగా నటిస్తూ నల్గొండ జిల్లాలోని పెద్దవూర, తిరుమలగిరి నేరేడుగొమ్ము. దేవరకొండ, పీఏపల్లి, మండలాలలోని అమాయక రైతుల నుండి రుణాలు ఇవ్వుటకు ముందుగా రైతుల వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకున్నారు,
హాలియా మండలంలోని ఒక వ్యాపారికి సోషల్ వెల్ఫేర్ నుండి అధిక మొత్తంలో రుణం ఇప్పిస్తామని నమ్మించి ఇప్పించకుండ మోసం చేస్తూ ఒక ముఠాగా ఏర్పడ్డ నిందితులను పెద్దవూర పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి ప్రస్తుతానికి రూపాయలు 1,25,000 రైతుల నుండి తీసుకున్న పట్టాదారు పుస్తకాలు అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీతెలిపారు.
ఆయా మండలాలలో రైతుల నుండి వ్యాపారస్తుల నుండి వసూలు చేసిన మొత్తం 25 లక్షల ఏడు వేల రూపాయలు అని తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు వచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల స్పష్టం..!
-
Komatireddy Venkatreddy : నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు.. వారం రోజుల్లో ప్రక్రియ, మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!
-
New Scheme : రైతులకు శుభవార్త.. రూ.600 కోట్లతో కొత్త పథకం..!
-
Health : ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంట్లో తయారుచేసిన పానీయాలు.. గుండె, మూత్రపిండాలు భద్రం..!









