Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : కేటీఆర్ కు బిగ్ షాక్.. ఫార్ములా ఈ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి..!

TG News : కేటీఆర్ కు బిగ్ షాక్.. ఫార్ములా ఈ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది.. ఫార్ములా ఈ కారు కేసులో విచారణకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉండడంతో విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9 న గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసింది.

దాంతో కొంతకాలంగా గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం ఎదురుచూసింది. 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి విచారణకు ఆమోదం లభించింది. దాంతో ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏ 1 గా ఉన్న కేటీఆర్ ను విచారించనున్నారు. ఆయన విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

గత సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఏసీబీ నమోదు చేసింది. ఇప్పటికీ కేటీఆర్ ను నాలుగు పర్యాయాలు సిబిఐ విచారణ చేసింది. గవర్నర్ అనుమతితో మరోసారి విచారణ అనంతరం జార్జ్ షీట్ దాఖలు చేశాక కేటీఆర్ ను అరెస్టు చేస్తారా..? అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

MOST READ : 

  1. TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)

  2. YS JAGAN : మాజీ సీఎం జగన్ కేసులో కీలక మలుపు.. నేడు నాంపల్లి కోర్టుకు హాజరు..!

  3. Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

  4. Penpahad : ఆర్డీవో హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు..!

మరిన్ని వార్తలు