Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralతెలంగాణ

TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)

TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)

మన సాక్షి డెస్క్ :

తన కారుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని ఓ యువకుడు తన తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో డ్రైవర్ బాలరాజు పై సిద్దిపేట జిల్లా గంగాపురం కు చెందిన యువకుడు తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు ముందుకు వచ్చి కారు ఆపాడు.

ఆ తర్వాత ఆవేశంతో బస్సు ఎక్కి తన తండ్రి వయసున్న డ్రైవర్ బాలరాజు పై కాళ్లతో తన్ని దాడి చేశాడు. బస్సులో ఉన్న వారంతా డ్రైవర్ కు సపోర్టుగా మాట్లాడినప్పటికీ కూడా అతడు అందరిపై గొడవపడిన వీడియో వైరల్ గా మారింది. దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు.

జిల్లా ఎస్పీకి ఆదేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద మా ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. విధుల్లో నిబద్ధతతో పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య. ఈ ఘటనపై నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారితో ఫోన్‌లో మాట్లాడి, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది

ప్రజల రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న మా ఆర్టీసీ సోదరులపై దాడులను అసలు ఉపేక్షించము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ ఉద్యోగులకు నా పూర్తి మద్దతు, మనోధైర్యం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇస్తున్నాను.

MOST READ :

  1. Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఏం చెప్పారంటే..!

  2. ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

  3. ICICI : హైదరాబాద్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ మరో బ్రాంచ్ ప్రారంభం.. నగరంలో ఎన్ని బ్రాంచ్ లో తెలుసా..!

  4. Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

మరిన్ని వార్తలు