Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఏం చెప్పారంటే..!

Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఏం చెప్పారంటే..!

పెన్ పహాడ్, మన సాక్షి:

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పెన్ పహాడ్ మండలంలోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసినారు. అనంతారం నారాయణగుడెం పిఎసిఎస్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించినారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కాంటాలలో, ధాన్యం ఎగుమతులలో, రైతులను ఇబ్బంది పెట్టకుండా వేగవంతం పెంచాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. కాంటాలలో ఎటువంటి తేడాలు వేసిన, రికార్డులు సక్రమంగా లేకపోయినా, ఎటువంటి అక్రమాల పాటుపడిన, సట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు యొక్క ర్యాంకులను , ఉపాధ్యాయుల విద్యని అభ్యసిస్తున్న విధానాన్ని పరిశీలించినారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి ఉన్నంత స్థాయికి ఎదగాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ విద్యార్థులకు సూచించారు.

అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించినారు. లబ్ధిదారులు వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేసి నూతన గృహాలలో నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ధారావతులాలు నాయక్, మండల అభివృద్ధి అధికారి జానయ్య, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, ఎంపీ ఓ రాజేశ్వర్, హౌసింగ్ బోర్డ్ ఏఈ నరేష్, ఏ ఈ ఓ శ్రావణి, సీఈవో ఆలకుంట్ల సైదులు, పంచాయతీ కార్యదర్శి సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బేగం, ప్రధానోపాధ్యాయులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Rythu : ఇదేం కండిషన్ మేడమ్.. డిఏపి కావాలంటే అవి తప్పనిసరిగా కొనాల్సిందే..!

  2. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

  3. Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!

  4. Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

మరిన్ని వార్తలు