Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Suryapet : మంత్రి ఉత్తమ్ కు బిగ్ షాక్.. ఉత్తమ్ ఇలాకాలో అతిపెద్ద గ్రామపంచాయతీ బీఆర్ఎస్ కైవసం..!

Suryapet : మంత్రి ఉత్తమ్ కు బిగ్ షాక్.. ఉత్తమ్ ఇలాకాలో అతిపెద్ద గ్రామపంచాయతీ బీఆర్ఎస్ కైవసం..!

మేళ్లచెరువు, మనసాక్షి :

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన నియోజకవర్గమైన హుజూర్ నగర్ లో అతిపెద్ద గ్రామపంచాయతీగా మేళ్లచెరువు ఉంది. కాగా అతిపెద్ద గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ గా గెలుపొందారు. అదేవిధంగా అత్యధిక అవార్డులు కూడా కైవాసం చేసుకుని ఉపసర్పంచి పదవి కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

సూర్యాపేట జిల్లాలోనే అత్యధిక ఓటర్లు కలిగిన మేళ్లచెరువు గ్రామం పంచాయితీ ఎన్నికల్లో బిఆర్ఎస్ వశమైంది. బుధవారం అర్ధరాత్రి వరకూ ఓట్ల లెక్కింపు కొనసాగింది. మేళ్లచెరువు లో 10657 ఓటర్లు ఉండగా 8887 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్ధి బచ్చు పద్మావతికి 4917 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి శాగంరెడ్డి పద్మ కు 3758 ఓట్లు దక్కాయి. 1159 ఓట్ల మెజారిటీతో బచ్చు పద్మావతి విజయం సాధించింది.

వార్డులలోనూ అదే ఊపు ప్రదర్శించారు.16 వార్డులలో 11 పద్మావతి టీంకు, 5 వార్డులు పద్మ టీంకు దక్కాయి. 210 ఓట్లు మురిగినట్లు, 2 ఓట్లు నోటాకు పోలైనట్లు ఎన్నికల ఆఫీసర్లు వెల్లడించారు. ఉప సర్పంచ్ గా 3 వ వార్డు నుండి గెలుపొందిన పసుపులేటి నాగమణిని గురువారం ఎన్నుకున్నారు.

MOST READ 

  1. District Incharge Collector : నారాయణపేట జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్.. ఎవరో తెలుసా..!

  2. Delhi : 50 శాతం వర్క్ ఫ్రం హోం.. ఉల్లంఘిస్తే జరిమానా..!

  3. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

  4. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

మరిన్ని వార్తలు