BREAKING : కాంగ్రెస్ సర్కార్ పై బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్..!
BREAKING : కాంగ్రెస్ సర్కార్ పై బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్..!
హైదరాబాద్ , మన సాక్షి :
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పైన, సర్కార్ పైన పలు విమర్శలు గుప్పించారు.
ఆయన కామెంట్స్ యధావిధిగా :
ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారు
ఏ ఊరికి వెళ్లిన అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తారు
కేసిఆర్ 20మంది టచ్ లో ఉన్నారనే మాటలు చూస్తే ..కేసిఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారేమో
నాకు అయితే అదే అనుమానం ఉంది
సీఎం హామీలను ప్రజలు నమ్మట్లేదు. అందుకే దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నారు
ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఒట్టు వేయడం బాధాకరం..
రుణమాఫీ ఒకే మిగిలిన హామీల మాటేమిటి?
మిగతా హామీల కొరకు ఎంత మంది దేవుళ్ళ మీద ఒట్టు పెడతావు?
నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి.
ఎన్నడు లేని విధంగా రైతులు గోస పడుతున్నారు.
ఒక్క వైపు నీళ్లు లేక రైతులు బాధపడుతుంటే ఇంకో వైపు ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
అకాల వర్షాలతో ధాన్యం తడిచింది. వీటిని ప్రభుత్వం కొనడం లేదు.
పంటకు బోనస్ ఇవ్వట్లేదు . పంటకు గిట్టుబాటు ధర, తడిసిన ధాన్యం కొనుగోలు లేదు , మీరు ప్రకటించిన బోనస్ లేదు.
రైతులకు ఇచ్చిన హామీల సీఎం కు నేను లేఖ రాస్తున్న
వ్యవసాయ రంగానికి మీరిచ్చిన హామీల ప్రకారం లక్ష కోట్లు అవసరం.
అంత బడ్జెట్ ఎక్కడి నుంచి జమ చేస్తారు?
కళ్యాణ లక్ష్మి , తులం బంగారం వస్తదని ఆడపడుచుల పెళ్ళీలు పోస్ట్ పోన్ చేసుకున్నారు.
విద్యార్థులకు స్కూటి ల మాటేమైంది?
మీరు ఇచ్చిన హామీల బాగోతం చిట్ట బయట పెడతాం.
ఇవన్నీ ఆగస్టు లోపల నెరవేరుస్తావా? లేదంటే రాజీనామా చేస్తావా?
రాజకీయం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టీ… దేవుళ్ళను వాడుకుంటున్నాడు.
ఆగస్టు వరకు రేవంత్ ఉంటాడో లేదో తెలీదు. ఆ ఒట్టు గట్టు మీద అవుతాదేమో.
మరెన్నో వార్తలు :
Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!
Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!
KTR : కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.. హామీల అమలుపై కేటీఆర్ ఘాటుగా ట్వీట్..!









