Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : బండి సంజయ్ ముందు బిజెపి నాయకుల నిరసన..!

Nalgonda : బండి సంజయ్ ముందు బిజెపి నాయకుల నిరసన..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షునిగా వర్షిత్ రెడ్డి నియామకాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెపి శ్రేణులు ఆదివారం బిజెపి జిల్లా కార్యాశాలలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ ముందు బిజెపి నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా అధ్యక్షుని నియామకం నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ తీసుకుందని 45, 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని ,రెండుసార్లు క్రియాశీలక సభ్యత్వం ఉండాలని, కేంద్ర పార్టీ నిబంధనలు ఉన్న నిబంధనలను తుంగలోతోక్కి ఏకపక్షంగా వర్షిత్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించారని ఇది అందరికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. వర్షిత్ రెడ్డి నియామకం చెల్లదని ఆరోపించారు.

పార్టీ కోసం 40 సంవత్సరాలుగా పనిచేశామని వర్షిత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వలన జిల్లాలో పార్టీ నష్టపోతుందని వలసలు ఆగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు సాంబయ్య రాఖి సాయి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
  3. Elections : పంచాయతీలకు 300, ఎంపీటీసీ లకు 94 పోలింగ్ కేంద్రాల గుర్తింపు..!
  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు