Miryalaguda : బిజెపి హెచ్చరిక.. దేవాలయ, పర్యావరణ పరిరక్షణకై పోరాటానికి సిద్ధం..!

Miryalaguda : బిజెపి హెచ్చరిక.. దేవాలయ, పర్యావరణ పరిరక్షణకై పోరాటానికి సిద్ధం..!
వేములపల్లి, మన సాక్షి:
రోడ్డు పనుల పేరుతో దేవాలయ భూములను ధ్వంసం చేయడం నిలిపివేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయతీ మీదగా వెళ్తున్న నాలుగు వరుసల రోడ్డు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు బిజెపి అడ్డు కాదు అని, రోడ్డు పనులకు ప్రభుత్వ భూమి ఎంతో ఉన్నప్పటికీ కొండలను గుట్టలను స్థానిక వేణుగోపాల స్వామి దేవాలయ పచ్చని పరిసరాలను ధ్వంసం చేయడం తగదన్నారు. అక్రమంగా చెట్లను రాళ్లను మట్టిని తరలించడం వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
స్థానికంగా నిర్మాణంలో ఉన్న దేవాలయ గుట్టను ధ్వంసం చేయడం పై వారు మండి పడ్డారు. తక్షణమే అన్యాక్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని రోడ్డు పనులను కొనసాగించాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంటే రోడ్డుని నిర్మాణం పేరుతో వందల సంవత్సరాల నాటి చెట్లను తొలగించడం, అమ్ముకోవడం, పచ్చని చెట్లకు నిప్పు పెట్టడం ఇది దేనికి నిదర్శనం అన్నారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రోడ్డు పనుల అక్రమాలపై దృష్టి సారించాలని లేనిపక్షంలో దేవాలయ, పర్యావరణ పరిరక్షణ కోసం బిజెపి నల్గొండ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. అనంతరం బిజెపి నాయకులు వేణుగోపాల స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల అధ్యక్షులు పెదమాం భరత్, బిజెపి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంటు సైదులు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచర్ల అభి, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చల్లమల్ల సీతారాం రెడ్డి, జవ్వాజి సత్యనారాయణ, పెదమాం వెంకన్న , జిల్లా నాయకులు జానకి రామ్ రెడ్డి
మండల పార్టీ ముఖ్య నాయకులు నిమ్మల జానారెడ్డి, పెదమాం ప్రసాద్, చక్కని ఉపేందర్, మాతంగి ప్రభాకర్, ఇరుగుదిండ్ల నరేష్, మల్లికంటి సైదయ్య, కేతనపల్లి భూపాల్ రెడ్డి, మొదల అశోక్, ఈట మహేష్, ఆలకుంట్ల మహేష్, సతీష్, రవి, వీరస్వామి, వెంకన్న, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు.. సీనియారిటీ జాంతానై.. కాంగ్రెస్ నేత ఫైర్..!
-
RRR : త్రిబుల్ ఆర్ కు భూములు ఇచ్చేది లేదు.. పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు..!
-
Ministers WhatsApp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూప్ హ్యాక్..!
-
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!









